3
April, 2026

A News 365Times Venture

3
Friday
April, 2026

A News 365Times Venture

Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!

Date:

Liquor Sales: తెలంగాణ రాష్ట్రంలో మద్యం వినియోగం మునుపెన్నడూ లేని విధంగా కొత్త రికార్డులను సృష్టించింది. తాజాగా ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విక్రయాలు భారీగా పెరిగినప్పటికీ, ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయ వృద్ధి మాత్రం నామమాత్రంగానే ఉండటం గమనార్హం.

Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!

గడిచిన ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1, 2025 నుండి మార్చి 31, 2026వరకు) రాష్ట్రంలో బీర్ల వినియోగం ప్రభంజనం సృష్టించింది. అంతకుముందు ఏడాది 136 లక్షల కేసులుగా ఉన్న బీర్ విక్రయాలు, ఈసారి ఏకంగా 232 లక్షల కేసులకు చేరాయి. అంటే దాదాపు 70.29% వృద్ధి నమోదైంది. వీటితోపాటు భారతీయ తయారీ మద్యం విక్రయాలు కూడా 362 లక్షల కేసుల నుండి 414 లక్షల కేసులకు (14.59% వృద్ధి) పెరిగాయి. దీనితోమద్యం అమ్మకాల మొత్తం విలువ రూ. 29,440 కోట్ల నుండి రూ. 31,237 కోట్లకు చేరింది.

మద్యం విక్రయాల విలువ 6.11% పెరిగినప్పటికీ, ప్రభుత్వానికి వచ్చే నికర ఆదాయ వృద్ధి కేవలం 0.68% మాత్రమే నిలిచిపోయింది. దీనికి దారితీసిన ప్రధాన కారణాలను అబ్కారీ శాఖ ఇలా విశ్లేషించింది. దీనికి ముఖ్య కారణం మార్కెట్లోకి వచ్చిన రూ. 99 (180 మి.లీ) బాటిళ్లకు ఆదరణ పెరిగింది. సామాన్యులు తక్కువ ధర బ్రాండ్లను ఎంచుకోవడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 442 కోట్ల ఆదాయం తగ్గింది. అలాగే ప్రముఖ బ్రాండ్ల ధరలను ప్రభుత్వం తగ్గించడంతో సగటు బాటిల్ ధర రూ. 180 నుండి రూ. 160కి పడిపోయింది. దీనివల్ల దాదాపు రూ. 972 కోట్ల మేర రాబడి తగ్గింది. వీటితోపాటు గత ఏడాది వచ్చిన రూ. 1,900 కోట్ల నాన్-రీఫండబుల్ ఫీజులు ఈసారి రాకపోవడం కూడా మొత్తం ఆదాయంపై ప్రభావం చూపింది.

Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్‌‌పై రూ.137, డీజిల్‌పై రూ.184 పెంపు

గణాంకాలను పరిశీలిస్తే, విక్రయాల ద్వారా వచ్చే నేరుగా వచ్చే ఆదాయం రూ. 25,727 కోట్లకు (4.01% వృద్ధి) పెరిగింది. అయితే లైసెన్స్ ఫీజులు, ఇతర విభాగాల్లో ఆదాయం 19.37% పడిపోవడంతో, రాష్ట్ర ఖజానాకు చేరిన మొత్తం నికర ఆదాయం రూ. 28,846 కోట్ల నుండి కేవలం రూ. 29,042 కోట్లకు మాత్రమే పరిమితమైంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Raghav Chadha: ‘‘నేను ఓడిపోలేదు.. నా మౌనం ఓటమి కాదు’’.. రాఘవ్ చద్దా ఆవేదన

ఆమ్ ఆద్మీ పార్టీలో మరోసారి భారీ కుదుపు జరిగింది. ఒకప్పుడు స్వాతి...

Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!

Warangal: వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి అక్రమాలపై అవినీతి నిరోధక...

US Army Chief Fired: యుద్ధం మధ్యలో ఆర్మీ చీఫ్‌కు షాకిచ్చిన రక్షణ మంత్రి.. అమెరికా సైన్యంలో భారీ కుదుపు

US Army Chief Fired: సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిపోయిన...

Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

Shroud Of Turin: ఏసు క్రీస్తుకు సంబంధించిన ‘‘ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్’’...