KTR: వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి దగ్గర జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ ప్రాంగణంలోనే ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడి కేటీఆర్.. టీఆర్ఎస్ కి ఒక విశిష్టత ఉంది.. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు రెండు మాత్రమే ఉన్నాయి.. ఇక, తెలంగాణ ప్రజల గొంతుగా పార్టీ పేరు తెచ్చుకుంది టీఆర్ఎస్.. ప్రజలు ఏ బాధ్యత ఇచ్చిన దాన్ని ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తున్న పార్టీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Pahalgam Terrorist Attack: రాత్రి వైజాగ్‌కు సీఎం చంద్రబాబు.. చంద్రమౌళి మృతదేహానికి నివాళులు!
కాగా, ఉద్యమ జిల్లాలో 1250 ఎకరాల ఏర్పాట్లు పరిశీలించామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.. 40 వేల వాహనం సౌకర్యం కలిపిస్తున్నాం.. వాహనాలు దూరం పెట్టి నడుచుకుంట రాకుండా సభ వేదిక దగ్గరనే పార్కింగ్ సౌకర్యం కల్పించారు.. నాలుగు ఏరియాలో పార్కింగ్ సౌకర్యాలు ఉంటాయి.. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మంచి నీటి సౌకర్యాలు కలిపిస్తున్నాం.. 100 వైద్య బృందాలు అందుబాటులో ఉంచామని చెప్పుకొచ్చారు. ఇక, 20 అంబులెన్స్ అందుబాటులో ఉంచాం.. కరెంటు సమస్యలు లేకుండా 200 జనరేటర్లు సిద్ధం చేసుకుంటున్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
Read Also: Heat Waves: తెలంగాణలో పెరుగుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్
అయితే, ఇది అతి పెద్ద బహిరంగ సభ కాబోతుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ను చూసేందుకు ఆయన మాటలు వినేందుకు పెద్ద ఎత్తున జనం చేందుకు సిద్ధం అవుతున్నారు.. సూర్యాపేట జిల్లా నుంచి ఎడ్ల బండ్ల మీద సభకి వస్తున్నారు.. ఉద్యమ స్ఫూర్తి చాటుతున్నారు.. 2000 మంది వాలంటీర్లు పెడుతున్నాం.. నాళాల దగ్గర వాలంటీర్లు పెడుతున్నాం.. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది.. మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం.. సాయత్రం 4 గంటలకు కేసీఆర్ సభ వేదికకు చేరుకుంటారు.. ఉదయం జండాలు ఎగురవేసి సభలకు బయలుదేరుతారు.. ఇప్పటి వరకు యంత్రాంగం సహకరిస్తోంది.. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న సభ ఇది కాదని కేటీఆర్ తేల్చి చెప్పారు.