13
April, 2026

A News 365Times Venture

13
Monday
April, 2026

A News 365Times Venture

Kohli-Vaibhav: “డియర్ వైభవ్.. వెల్ డన్”.. వైభవ్‌ సూర్య వంశీకి విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్!

Date:

Virat Kohli Gifts Autograph to Vaibhav Sooryavanshi: రాజస్థాన్ రాయల్స్ కింగ్ వైభవ్ సూర్య వంశీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. స్టార్ బౌలర్లకు చుక్కులు చూయించాడు. కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసి 300 స్ట్రైక్ రేట్‌తో ఆర్సీబీ బౌలింగ్ విభాగాన్ని చిన్నాభిన్నం చేశాడు. వైభవ్ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్, కింగ్ కోహ్లీ ఈ కుర్రాడి నైపుణ్యాన్ని కొనియాడుతూ క్రేజీ గిఫ్ట్ ఇచ్చాడు. మైదానంలో వైభవ్ బ్యాటింగ్ పవర్‌ను స్వయంగా చూసిన కోహ్లీ, మ్యాచ్ ముగిసిన తర్వాత అతనికి ఒక మధుర జ్ఞాపకాన్ని అందించాడు. వైభవ్ అభ్యర్థన మేరకు కోహ్లీ రాజస్థాన్ రాయల్స్ క్యాప్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అంతేకాకుండా “డియర్ వైభవ్, వెల్ డన్” అంటూ ఒక ప్రత్యేక సందేశాన్ని కూడా ఆ క్యాప్‌పై రాశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

READ MORE: Madhubala biopic: సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్.. మధుబాలగా మలయాళ భామ !

ఇక.. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో వైభవ్ కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 200 పరుగులు పూర్తి చేసి, ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ‘ఆరెంజ్ క్యాప్’ దక్కించుకోవడం విశేషం. 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ (78), ధ్రువ్ జురెల్ (నాటౌట్ 81) మెరుపులు రాజస్థాన్‌ను సునాయాసంగా గెలిపించాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తన యువ ఓపెనర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. “వైభవ్‌కు బయట తిరగడం, రకరకాల వంటకాలు తినడం అంటే చాలా ఇష్టం. అతను ఇలాగే బ్యాటింగ్ చేస్తూ ఉంటే, అతనికి కావాల్సినవన్నీ మేము సమకూరుస్తాం. అతను ఇంకా చిన్న పిల్లాడే, అప్పుడప్పుడు అల్లరి పనులు చేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు. అతనికి బ్యాటింగ్ అంటే పిచ్చి, అందుకే అతనికి సాధ్యమైనంత ఎక్కువ సమయం క్రీజులో గడిపేలా మేము ప్రోత్సహిస్తున్నాం” అని పరాగ్ సరదాగా పేర్కొన్నాడు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Chaitanyapuri Fraud Case: కోట్లలో వరకట్నం, ఘనంగా నిశ్చితార్థం.. చైతన్యపురిలో నకిలీ ఎఫ్‌సీఐ ఉద్యోగి దొరికిపోయాడిలా!

చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి పేరుతో భారీ మోసం జరిగిన...

Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్‌గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్‌ హత్య..

Palnadu Police Crime: పల్నాడు జిల్లాలో వరుస ఘటనలు ప్రజల్లో తీవ్ర...