11
February, 2026

A News 365Times Venture

11
Wednesday
February, 2026

A News 365Times Venture

Kodo Millet Idli: ఇంట్లోనే తక్కువ టైమ్‌లో హెల్తీ, టేస్టీ టిఫిన్.. రైస్ లేకుండా అరికెలతో మృదువైన ఇడ్లీలు

Date:

Kodo Millet Idli: ఇడ్లీని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మృదువుగా ఉండి సులభంగా జీర్ణమవుతుంది. కడుపు నిండేలా చేస్తుంది. అయితే ఈ ఇడ్లీని ఇంకా ఆరోగ్యకరంగా మార్చాలంటే బియ్యం బదులుగా మిల్లెట్స్ వాడితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన మీకూ వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కోడో మిల్లెట్ (ఆరికలు) ఇడ్లీ గురించి తెలుసుకుందాం.. కోడో మిల్లెట్‌ను తమిళంలో వరగు, తెలుగులో అరికెలు అంటారు. ఇది పోషకాలు ఎక్కువగా ఉన్న ఒక మంచి ధాన్యం. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. బియ్యంతో పోలిస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. తరచుగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గాలని భావించే వారికి సైతం ఇది ఉపయోగకరం. ఇప్పుడు ఇంట్లోనే కోడో మిల్లెట్ స్టఫ్డ్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం.

READ MORE: Telangana Municipal Elections: తెలంగాణలో ఎన్నికల పోరు షురూ..

ముందుగా ఆరికెలతో ఇడ్లీ పిండిని సిద్ధం చేసుకోవాలి.పొటాటో మసాలా కోసం మూడు పెద్ద బంగాళాదుంపలను మరిగించి తొక్క తీసి మెత్తగా చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించాలి. తరువాత ఉల్లిపాయలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. పసుపు, ఉప్పు వేసి కలపాలి. చివరగా మెత్తగా చేసిన బంగాళాదుంపలు వేసి బాగా కలిపి నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించాలి. అంతే, పొటాటో మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇడ్లీ మోల్డ్స్‌కి కొద్దిగా నూనె రాసి, ముందుగా కొంచెం పిండిని పోయాలి. దాని మీద ఒక స్పూన్ పొటాటో మసాలా వేయాలి. పైగా మళ్లీ కొంచెం పిండిని పోసి మూసివేయాలి. తరువాత 12 నుంచి 15 నిమిషాలు ఆవిరితో ఉడికించాలి. వేడి వేడి కోడో మిల్లెట్ స్టఫ్డ్ ఇడ్లీ రెడీ. ఇడ్లీలు మెత్తగా రావాలంటే పిండి పులియడం చాలా ముఖ్యం. కనీసం 8 నుంచి 10 గంటలు, రాత్రంతా వేడి ప్రదేశంలో ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా పులిస్తే ఇడ్లీలు మృదువుగా వస్తాయి. అలాగే పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

UP: భార్య చనిపోయిన 2 ఏళ్లకు ‘ఓటీపీ’.. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య...

AR Rahman : టాలీవుడ్‌లో రెహమాన్ సెకండ్ ఇన్నింగ్స్.. ‘పెద్ది’ మ్యూజిక్ తెచ్చిన క్రేజ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా...

TGTET Results : అలర్ట్.. టీజీ టెట్ ఫలితాలు విడుదల..

TGTET Results : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న...