10
July, 2026

A News 365Times Venture

10
Friday
July, 2026

A News 365Times Venture

Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..

Date:

Kodali Nani: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి రావణ్ వ్యవహారంపై స్పందించారు. రావణ్ అసలు పేరు, మత గుర్తింపును టీడీపీ, అనుకూల మీడియా వక్రీకరించాయని ఆయన ఆరోపించారు. రావణ్‌కు బెయిల్ రావడంలో వైసీపీ పాత్ర లేదని, ఈ అంశంలో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రావణ్ అరెస్టు, అనంతర పరిణామాలపై జనసేన, టీడీపీ వ్యవహార శైలిని కొడాలి నాని ప్రశ్నించారు. చిన్న సోషల్ మీడియా పోస్టులకే అరెస్టులు జరుగుతున్నాయని, అయితే రావణ్ విషయంలో భిన్నంగా ఎందుకు వ్యవహరించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిర్ణయాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే ఇతరుల ప్రభావంతోనే జరుగుతున్నాయని కూడా ఆయన విమర్శించారు.

మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని కొడాలి నాని సూచించారు. హిందువులు, క్రైస్తవులు సామరస్యంగా జీవిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం సామాజిక విభేదాలను రెచ్చగొట్టడం తగదని అన్నారు. 2029 ఎన్నికల్లో పరుశురాముడు గొడ్డలితో జగన్, చంద్రబాబు ప్రభుత్వాన్ని, పార్టీని రాజకీయ సమాధి చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నాను.. చంద్రబాబు ఇచ్చే కట్టెలు కొట్టడానికి కూడా పనికిరాని తుప్పు గొడ్డలి మాకెవరికి అవసరం లేదని ఎద్దేవా చేశారు..

అసలు, రావణ్ ను జోసఫ్ గా మార్చింది ఎవరు? అని ప్రశ్నించిన కొడాలి.. కమ్మ వ్యక్తిని దళితుడిగా, క్రిస్టియన్ గా మార్చింది టీడీపీ, ఎల్లో మీడియా, పేటియం బ్యాచ్ అని మండిపడ్డారు.. కుటుంబ సభ్యుల మాటలు కూడా లెక్కచేయకుండా రావణ్ ఐడెంటిటీని మార్చేశారు. రావణ్ పేరు రావణ్… జోసఫ్ కాదు, అతను క్రిస్టియన్ కాదు. రావణ్ అరెస్టు వెంటనే అత్యవసర సమావేశం పెట్టి సెక్షన్లు చదివింది పవన్ కల్యాణ్ కాదా? అని నిలదీశారు.. జనసైనికులు పెట్టిన కేసుల్లో బెయిల్ ఇప్పించింది ఎవరు?… జగన్ గాని, మేం గాని ఎవరికీ ఫోన్ చేసి బెయిల్ ఇప్పించమని చెప్పలేదు. బెయిల్ రావడంలో చంద్రబాబు పాత్ర లేదని ఎవరైనా చెప్పగలరా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.. అయితే, జనసేన హడావుడి ఆగకపోవడంతో ఉప్మా చట్టం పెట్టి రావణ్ ను జైలుకు పంపారు.. రావణ్.. జగన్ ను తిడతాడు, పవన్ ను ఇంకా ఎక్కువ తిడతాడు… కానీ, లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబును ఒక్క మాట కూడా అనడు.. గత వీడియోలు పరిశీలిస్తే రావణ్ ఎవరికి అనుకూలమో అర్థమవుతుందని సూచించారు కొడాలి నాని..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Nitin Gadkari: E20 పెట్రోల్ వల్ల ఒక్క కారైనా పాడైందా?.. విమర్శకులపై కేంద్ర మంత్రి గడ్కరీ ఫైర్..

Nitin Gadkari: పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం (Ethanol-blended petrol) వల్ల వాహనాల...

Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాల చర్చ.. మాజీమంత్రిపై మంత్రి ఫిర్యాదు.!

Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి విభేదాల...

Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..

Dy. CM Bhatti Vikramaraka: ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురంలో...