3
May, 2026

A News 365Times Venture

3
Sunday
May, 2026

A News 365Times Venture

KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్‌లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..

Date:

రేపు (మే3,2026) ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ వరుసగా ఐదు విజయాలతో ఊపుమీదుంటే, కోల్‌కతా తన ఓపెనింగ్ సమస్యలతో సతమతమవుతోంది. ఎలాగైనా హైదరాబాద్ మీద గెలవాలన్న కసితో కేకేఆర్ ప్రణాళికలు రచిస్తోంది.

హైదరాబాద్ దూకుడు.. కోల్‌కతా కష్టాలు..
హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్ హింగే నెట్స్‌లో కొత్త బంతితో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కోల్‌కతా టాప్ ఆర్డర్ బ్యాటర్లను ఆరంభంలోనే దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ఫామ్ హైదరాబాద్‌కు పెద్ద ప్లస్ పాయింట్. ఈ సీజన్‌లో కోల్‌కతా ఓపెనర్లు అస్సలు రాణించడం లేదు. రహానే ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. సునీల్ నరైన్ మళ్ళీ ఓపెనర్‌గా వస్తాడా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) భారీ ధర 18 కోట్లకు కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్ మతీష పతిరాణ, జట్టులోకి వచ్చి రెండు మ్యాచ్‌లు గడిచినా ఇంకా మైదానంలోకి దిగలేదు. గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరిన పతిరాణ, రేపు హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

బౌలింగ్ కోచ్ టిమ్ సౌథీ మాట్లాడుతూ.. పతిరాణ నెట్స్‌లో బాగా బౌలింగ్ చేస్తున్నాడని, పిచ్ పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం కేకేఆర్ ఓవర్సీస్ ఆటగాళ్లుగా గ్రీన్, నరైన్, సీఫెర్ట్, పావెల్‌లను ఆడిస్తోంది. అయితే సీఫెర్ట్ వరుసగా డకౌట్ అవ్వడం, పావెల్ రాణించకపోవడంతో పతిరాణ లేదా ఫిన్ అలెన్‌లకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. వరుస విజయాలతో ఉన్న కేకేఆర్, పతిరాణను జట్టులోకి తెచ్చి బౌలింగ్‌ను మరింత బలోపేతం చేయాలని చూస్తోంది.

హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి, రేపు సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండవచ్చు. ఈ మ్యాచ్ మూడో నంబర్ పిచ్‌పై జరుగుతుంది. సాధారణంగా ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిచ్ కొంచెం నెమ్మదించే అవకాశం ఉన్నా, పరుగులకైతే లోటుండదు.

స్పిన్నర్లను ఎదుర్కోవడంలో క్లాసెన్ దిట్ట. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అతను 200 పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తాడు. ట్రావిస్ హెడ్ పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో నరైన్ రికార్డ్ బాగుంది. ఈ సారి పకడ్బందీ ప్రణాళికతో కేకేఆర్ బరిలోకి దిగి సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడుకు కళ్లెం వేయాలనే ఆత్రుతతో ఉంది. రికార్డుల పరంగా కోల్‌కతాకు హైదరాబాద్‌పై మంచి ఆధిపత్యం (20-11) ఉన్నా.. ప్రస్తుత ఫామ్ చూస్తే మాత్రం సన్‌రైజర్స్‌దే పైచేయిలా కనిపిస్తోంది. మరి ఉప్పల్ గడ్డపై ‘ఆరెంజ్ ఆర్మీ’ ఆరో విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ వారు మరోసారి తన...

Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..

Iran: అమెరికాలో ఉద్రిక్తతల కొనసాగుతున్న వేళ, దేశంలో ఉరిశిక్షలకు తెర తీసింది...

Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున సంచలన ఇన్నింగ్స్‌లతో...

Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్‌డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలు, వివాదాస్పద ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌పై బీసీసీఐ...