11
March, 2026

A News 365Times Venture

11
Wednesday
March, 2026

A News 365Times Venture

Kidnap Case : మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు నోటీసులు జారీ.. అరెస్ట్ తప్పదా?

Date:

తిరుపతిలో సంచలనం రేపిన విద్యార్థి నేతల అపహరణ కేసులో టాలీవుడ్ హీరో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్‌ఎఫ్‌ఐ (SFI) నేతలను కిడ్నాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని పోలీసులు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.

Also Read : Budget Problems : భారీ బడ్జెట్ సమస్యతో ఆగిన క్రేజీ సూపర్ హీరో సీక్వెల్

 ఈ కిడ్నాప్ కేసులో యూనివర్సిటీ పీఆర్‌ఓ సతీష్‌ను ఏ-1గా , నటుడు మంచు విష్ణును ఏ-2 గా ఆయన తండ్రి సీనియర్ నటుడు మంచు మోహన్ బాబును ఏ-3 గా ఎఫ్ఐఆర్‌లో వారిని కీలక నిందితులగా చేర్చారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో పీఆర్‌ఓ సతీష్‌తో పాటు పలువురు బౌన్సర్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బాధితుల వాంగ్మూలం మరియు ప్రాథమిక ఆధారాల మేరకు యూనివర్సిటీ యాజమాన్యం ప్రోద్బలంతోనే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ మంచు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని, తమ విద్యాసంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మంచు కుటుంబం ఆరోపిస్తోంది. ఈ కేసులో పోలిసుల విచారణకు మంచు మోహన్ బాబు, విష్ణు హాజరవుతారో లేదో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Heatwave Warning: మే నెల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఎల్ నినోపై ఐఎండీ వార్నింగ్

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి ప్రారంభం నుంచే...

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌‌కు సీరియస్.. సీక్రెట్ ప్లేస్‌కు మోజ్తాబా!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా నియమితులయ్యారు. ఈ...

IPL 2026: క్రికెట్ ఫాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ఫస్ట్ మ్యాచ్‌లో కీలక మార్పు.. ఈ రెండు టీమ్‌ల మధ్యే తొలి పోరు!

IPL 2026 Schedule: క్రికెట్ అభిమానులకు కిక్ ఎక్కిచ్చే న్యూస్ వచ్చేసింది....