11
April, 2026

A News 365Times Venture

11
Saturday
April, 2026

A News 365Times Venture

Kavitha : BRSలో కలవరానికి కారణమవుతున్న కవిత మాటలు

Date:

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరగబోతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత సొంతంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేశారు. అయితే, ఆమె పెట్టబోయే పార్టీ పేరుపై ఇన్నాళ్లూ సాగిన ఉత్కంఠకు తెర దించుతూ కవిత చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

కొత్త పార్టీ పేరు గురించి మొదటిసారి నోరు విప్పిన కవిత, తన పార్టీ “పాత పేరు.. కొత్త ఎజెండా”తో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. తమ పార్టీ పేరు ‘టీఆర్ఎస్’ (TRS) కూడా కావచ్చేమోనని వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2001లో ప్రారంభమైన టీఆర్ఎస్ పేరుతోనే తెలంగాణ ఉద్యమం నడిచిందని, ఆ పేరుపై ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను మళ్లీ తనవైపు తిప్పుకోవాలని కవిత వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Relaiance Jio: జియోకు షాక్ ఇచ్చిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకే అవకాశం..

గతంలో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినప్పుడు ఆ పాత పేరు (టీఆర్ఎస్) ఎన్నికల కమిషన్ వద్ద ఫ్రీజ్ అయింది. అయితే, దీనిపై కవిత తనదైన విశ్లేషణ ఇచ్చారు. సాధారణంగా ఏదైనా పార్టీ పేరు రెండు సంవత్సరాల పాటు మాత్రమే ఫ్రీజ్ అయి ఉంటుందని, ఆ తర్వాత ఆ పేరును ఇతరులు దక్కించుకునే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం తమ పార్టీకి సంబంధించి ఒక ప్రత్యేక బృందం పనిచేస్తోందని కూడా ఆమె వెల్లడించారు.

Petrol, Diesel, LPG: పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..

కవిత చేసిన ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకత్వం తీవ్రంగా ఖండిస్తోంది. ప్రస్తుత ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ పేరును వేరే ఎవరికీ కేటాయించే అవకాశం లేదని వారు వాదిస్తున్నారు. తాము కావాలని కోరుకున్నా సరే ఆ పేరు మళ్లీ వచ్చే పరిస్థితి లేదని, అలాంటిది మరొకరు ఆ పేరును ఎలా తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. కవిత కేవలం గందరగోళం సృష్టించడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కొట్టిపారేస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాతే ఆ పార్టీ గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైంది. తెలంగాణ అనే గుర్తింపు పేరులో లేకపోవడంతో క్యాడర్ , ప్రజల్లో కొంత నిరాశ నెలకొంది. ఇప్పుడు కవిత సరిగ్గా అదే పాయింట్‌ను పట్టుకుని, టీఆర్ఎస్ పేరును మళ్లీ తెరపైకి తేవడం ద్వారా బీఆర్ఎస్ శ్రేణులను తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఎమ్మెల్యేలు తన పార్టీలోకి వస్తారని, టీఆర్ఎస్ పేరును తానే దక్కించుకుంటానని ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

SRH Powerplay Record: పవర్ ప్లేలో మరో రికార్డ్.. పంజాబ్ బౌలర్లను చితకొట్టిన SRH బ్యాటర్స్..!

SRH Powerplay Record: ఐపీఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్ వేదికగా...

Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..

Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో భాగంగా 900 పిల్లలను...

Best CNG SUVs India: దేశంలో అత్యంత చౌకైన 5 CNG SUVలు ఇవే.. ధరలు రూ. 6.75 లక్షల నుండి ప్రారంభం

ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో, CNG SUVs భారతీయులకు...