9
March, 2026

A News 365Times Venture

9
Monday
March, 2026

A News 365Times Venture

Kavitha : ఇళ్లను కూల్చివేసిన నాయకులకు ఆడ బిడ్డల ఉసురు తగులుతుంది

Date:

వెలుగుమట్ల ప్రాంతంలో రాత్రికి రాత్రి ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. నిరాశ్రయులైన కుటుంబాల దీనస్థితిని చూసి ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం , స్థానిక నాయకుల తీరుపై ఆమె నిప్పులు చెరిగారు. చిన్న పిల్లలు, విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయనే కనీస మానవత్వం లేకుండా బుల్డోజర్లతో ఇళ్లను నేలమట్టం చేశారని కవిత మండిపడ్డారు. రాత్రికి రాత్రి వచ్చిన బుల్డోజర్లు పేదవాడి సొంతింటి కలను ఛిన్నాభిన్నం చేశాయని, విద్యార్థుల పుస్తకాలతో సహా సామాన్లన్నీ మట్టిలో కలిసిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో ఆడబిడ్డలు, చిన్న పిల్లలు రోడ్డున పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

“ఒక్క ఆడబిడ్డ ఏడిస్తేనే ఆ ఇంటికి మంచిది కాదు.. అలాంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డల దుఃఖం చూస్తుంటే కడుపు తరిగిపోతోంది” అని కవిత వ్యాఖ్యానించారు. అధికార మదంతో ఇళ్లను కూల్చివేసిన నాయకులకు, ఈ ప్రభుత్వానికి బాధితుల శాపం కచ్చితంగా తగులుతుందని ఆమె హెచ్చరించారు. పేదవాడి ఆవేదనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని సూచించారు. బాధితులను పరామర్శించేందుకు వస్తున్న కొందరు నాయకులపై ఆమె విమర్శలు గుప్పించారు. ఇది పేదవాడి జీవిత కాలపు ఆవేదన అని, కానీ కొందరు నాయకులకు ఇది ఎగ్జిబిషన్‌లా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

SAP Chairman-Bollineni Chandrika: అనారోగ్యంతో బాధపడుతున్న క్రీడాకారిణి చంద్రిక.. శాప్ చైర్మన్ ఆర్థిక సహాయం!

కేవలం పర్యటనలు చేసి వెళ్లే టూరిస్టుల్లా కాకుండా, బాధితులకు నిజమైన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా ఎప్పుడూ పేద ప్రజల పక్షానే ఉంటానని బాధితులకు కవిత భరోసా ఇచ్చారు. ముఖ్యంగా తన ఆడబిడ్డల కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Russia Support Iran: ‘ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తాం’.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు..

పశ్చిమ ఆసియా దేశాల్లో ముదురుతున్న ఉద్రిక్తతల వేళ.. రష్యా-ఇరాన్ సంబంధాలు వ్యూహాత్మక...

G7 Meeting: జీ7 దేశాలు అత్యవసర భేటీకి పిలుపు.. చమురుపై కీలక చర్చ!

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది....

Stock Market: ఇన్వెస్టర్ల 14 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే.!

Stock Market: నేడు భారత స్టాక్ మార్కెట్ లో ఎక్కడ చూసినా...