16
April, 2025

A News 365Times Venture

16
Wednesday
April, 2025

A News 365Times Venture

Karthi : పిలిచి ఛాన్స్ ఇస్తే కార్తీకి తలనొప్పిగా మారిన డైరెక్టర్

Date:

20 ఏళ్లలో 25 ఫిల్మ్స్ చేసి కెరీర్‌ను ఓ పద్ధతిగా ప్లాన్ చేసుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తి. మంచి కంటెంట్ చిత్రాలను చూజ్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమారసామి. సూదు కవ్వం, కాదలుం కడందు పోగుమ్ చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్.. స్టోరీ నచ్చి కార్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యింది. కార్తి 26గా 2023లో ప్రారంభమైన ఈ సినిమాకు లాస్ట్ ఇయర్ మేలో.. వా వాత్తియార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కార్తిని పోలీస్ ఆఫీసర్‌గా సరికొత్త గెటప్‌లో చూపించబోతున్నాడు దర్శకుడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కంటే వెనుక స్టార్ట్ అయిన కార్తి 27 సత్యం సుందరం ఇప్పటికే రిలీజై క్లాసిక్ హిట్ అందుకుంది.

Gangavva : ‘గంగవ్వ’ ఏంటి ఇలా మారిపోయింది..

అలాగే సర్దార్ 2 కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ వా వాత్తియార్ మాత్రం కంప్లీట్ కాలేదని టాక్. ఇంకా 20 రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. షూటింగ్ డిలేపై నిర్మాత కూడా నలన్‌పై గుర్రుగా ఉన్నాడన్నది బజ్. ఇప్పటికే అప్‌కమింగ్ ప్రాజెక్టుల కోసం దర్శకులను లైన్‌లో పెట్టేస్తుంటే.. వా వాత్తియార్ కంప్లీట్ కాకపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్టులపై కార్తి ఫోకస్ చేయలేకపోతున్నాడట. డైరెక్టర్ తమిళ్‌తో కార్తి 29 ఎనౌన్స్ చేశాడు. లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 ఉంటుందని వెల్లడించాడు. ఇవే కాకుండా మారి సెల్వరాజ్, హెచ్ వినోద్, వాసుదేవ్ మీనన్‌తో కొలాబరేట్ కాబోతున్నాడన్నది బజ్. కానీ వా వాత్తియార్ సెట్స్‌పైనే ఉండటంతో వీటికి షిఫ్ట్ కాలేని పరిస్థితి. ఈ బొమ్మను జనవరిలో రిలీజ్ చేద్దామనుకుంటే.. షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు జూన్‌లో అనుకుంటే.. అప్పుడు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదట. ఇదే నిజమైతే సర్దార్ 2 తర్వాతే అనేది కోలీవుడ్ టాక్. ఇప్పటికే సర్దార్ 2 పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ బొమ్మను సెప్టెంబర్ 5కి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి వా వాత్తియార్‌ను నలన్ ఎప్పుడు కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తాడో? కార్తికి ఎప్పుడు టెన్షన్ తగ్గిస్తాడో..? చూడాలి మరి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Trump: వలసదారులకు ట్రంప్ ప్రత్యేక ఆఫర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి...

Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యంగా జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచే తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్...

SCCL: ఒడిశాలో సింగరేణి తొలి అడుగు.. నేడు నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభం

SCCL: సింగరేణి కాలరీస్ కంపెనీ (SCCL) చరిత్రలో మరో కీలక మైలురాయిగా...

Preity Mukhundhan: ఓవర్ నైట్ స్టార్ బ్యూటీలకు పోటీగా మారిన అండర్ రేటెడ్ హీరోయిన్

కాయాదు లోహర్, మమితా బైజు లాంటి యూత్ క్రష్ బ్యూటీలకు ఓ...