27
March, 2026

A News 365Times Venture

27
Friday
March, 2026

A News 365Times Venture

Karnataka: మాజీ డీజీపీ హత్య వెనుక మిస్టరీ ఇదే..!

Date:

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం పోలీసులు సంఘటనాస్థలికి చేరుకోగానే ఓం ప్రకాష్ రక్తపుమడుగులో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. భార్య పల్లవి.. కుమార్తె చంపినట్లుగా పోలీసులు తేల్చారు.

ఈ మధ్య కాలంలో ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు కనుగొన్నారు. అయితే చావుబతుకుల మధ్య రక్తపుమడుగులో ఉన్నప్పుడు తనను కాపాడాలంటూ 15 నిమిషాలు ఓం ప్రకాష్ వేడుకున్నారు. కానీ భార్య, కుమార్తె ఏ మాత్రం కాపాడే ప్రయత్నం చేయలేదని పోలీసులు తెలిపారు. ఇక ఘటనాస్థలిలో రెండు కత్తులు, ఒక బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. హత్య చేశాక.. ఘటనాస్థలిలో కారం పొడి చల్లేశారు. ఆయుధాలపై కూడా కారం చల్లారు.

ఇక ఓం ప్రకాష్‌ను చంపేశాక.. ఆ రాక్షసుడిని చంపేశానంటూ భార్య పల్లవి విల్లా బయటకు వచ్చి పెద్ద పెద్దగా కేకలు వేసింది. దీంతో అక్కడ వారంతా షాక్‌కు గురయ్యారు. గత వారం రోజులుగా ఆస్తి గొడవలు ఎక్కువైనట్లుగా తెలుస్తోంది. 3 రోజుల క్రితం ఓం ప్రకాష్ భార్య పల్లవి ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్‌లో పెట్టిన మెసేజ్ సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇంట్లో భర్త తుపాకీతో తిరుగుతున్నాడని.. తనను, కుమార్తెను చంపేస్తానని బెదిరిస్తున్నాడని మెసేజ్‌లో వాపోయింది. భర్తపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. కానీ ఇంతలోనే ఓం ప్రకాష్ హత్యకు గురయ్యాడు.

ఇక ఓం ప్రకాష్‌ను చంపేశాక భార్యనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని నివాసానికి పోలీసులు వచ్చారు. చాలా సేపు డోర్లు ఓపెన్ చేయలేదు. మొత్తానికి లోపలికి వెళ్లి చూడగా హత్యకు గురైనట్లుగా గుర్తించి పోస్టుమార్టానికి తరలించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Heart Touching Story : చనిపోయినా విడిపోలేదు.. విగ్రహాలు కట్టి ప్రతి ఏడాది పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు.!

ప్రేమకు చావు లేదని చాటిచెప్పే ఉదంతాలు అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. మహబూబాబాద్...

Telangana: కీలక అలర్ట్.. ఆ జిల్లాలో మార్చి 28న బంద్.. కారణం ఇదే..

నిర్మల్ పట్టణంలో ప్రముఖ శిశువైద్యుడు డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన...

PM Modi: “మోడీ గారు యుద్ధాన్ని ఆపండి”.. ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ విజ్ఞప్తి

PM Modi: ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ, ప్రపంచంలోని వివిధ...

RBL Bank: బిగ్ షాక్.. ఆర్బీఎల్‌ బ్యాంక్‌లో భారీ కుంభకోణం..

కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ ద్వారా భారీ...