16
March, 2026

A News 365Times Venture

16
Monday
March, 2026

A News 365Times Venture

Karnataka: ఉమెన్స్ డే రోజు దారుణం.. ఇజ్రాయెల్ టూరిస్ట్‌పై గ్యాంగ్‌రేప్

Date:

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కర్ణాటకలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ మహిళా పర్యాటకురాలు, హోమ్ స్టే యజమానిపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

టెక్ హబ్ బెంగళూరు నుంచి 350 కి.మీ దూరంలో ఉన్న కొప్పల్‌ అనే ప్రాంతంలో తుంగభద్ర ఎడమ ఒడ్డున నక్షత్రాలను చూడటానికి ఐదుగురు వ్యక్తులు వెళ్లారు. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఇందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. ఒకరు అమెరికన్, ఇంకొకరు ఇజ్రాయెల్‌కు చెందిన మహిళ ఉన్నారు. గురువారం రాత్రి 11:30 గంటలకు కాలువ దగ్గర నక్షత్రాలను వీక్షిస్తుండగా.. దుండగులు బైక్‌పై వచ్చినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు.

జరిగిన ఘోరంపై 29 ఏళ్ల హోమ్‌స్టే యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను.. మరో నలుగురు అతిథులతో కలిసి రాత్రి భోజనం తర్వాత తుంగభద్ర కాలువ చూసేందుకు వెళ్లామని.. కాలువ ఒడ్డున నక్షత్రాలు చూస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు తమపై అత్యాచారానికి పాల్పడ్డారని.. అతిథులను కాలువలో తోసేశారని పేర్కొంది. అమెరికాకు చెందిన డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్ అనే అతిథులు బయటకు రాగలిగారని.. ఒడిశాకు చెందిన బిబాష్ జాడ మాత్రం కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నిందితులు.. మహిళలను లక్ష్యంగా చేసుకున్నారని.. కొప్పల్ పోలీసు సూపరింటెండెంట్ అరసిద్ది తెలిపారు. ఇద్దరు మహిళలపై దాడి చేయడమే కాకుండా.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో మహిళ పేర్కొన్నట్లు చెప్పారు. ప్రస్తుతం మహిళలు ప్రభుత్వాస్పత్రిలో కోలుకుంటున్నారని.. వారు కోరుకుంటే ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. నిందితులపై అత్యాచారం, సామూహిక అత్యాచారం, దోపిడీ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఫిర్యాదు అందగానే వెంటనే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇక నిందితులను గుర్తించామని.. రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. అత్యాచారం జరిగిందా? లేదా? అని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇక కాలువలో తప్పిపోయిన పర్యాటకుడి కోసం ఫైర్ సిబ్బంది, పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

Vaibhav Sooryavanshi: క్రికెట్‌ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు....

SaiPallavi: భన్సాలీ కన్ను సాయిపల్లవిపైనే.. ఆ లెజెండరీ బయోపిక్ సెట్ అయినట్లేనా!

SaiPallavi: వైవిధ్యమైన పాత్రలు, సహజసిద్ధమైన నటనతో దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు...

Jagityal : పార్టీ మారుతానని జీవన్ రెడ్డి సిగ్నల్స్ .. పట్టించుకోని కాంగ్రెస్ ?

Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన జీవన్...