7
March, 2026

A News 365Times Venture

7
Saturday
March, 2026

A News 365Times Venture

Kamal Haasan: ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు.. తొలి స్పీచ్‌లో కమల్‌హాసన్ వార్నింగ్

Date:

ఎవరికీ అధికారం శాశ్వతం కాదని.. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం శాశ్వతంగా లేదని మక్కల్ నీది మయ్యం అధినేత, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా తొలిసారి కమల్‌ హాసన్ రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Bill Gates: నేను చింతిస్తున్నా.. క్షమించండి.. ఎప్‌స్టీన్ ఫైల్‌పై బిల్‌ గేట్స్ పశ్చాత్తాపం

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాను తీవ్రంగా విమర్శించారు. తమిళనాడులో దాదాపు కోటి మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని.. వారంతా బతికినంత కాలం చనిపోయే ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీహార్‌ను ఉదాహరణగా చూపిస్తూ ఎన్నికల కమిషన్ జీవిస్తున్నవారిని కూడా చనిపోయినట్లుగా పేర్కొంటుందని గుర్తుచేశారు. ఇదొక కొత్త రకమైన వ్యాధిగా అభివర్ణించారు. ఈ వ్యాధి దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందకూడదన్నారు. ఎన్నికల కమిషన్ అయితే ఈ వ్యాధి వ్యాప్తి చేయడానికి పూనుకుందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ మా ఓటు హక్కును తనిఖీ చేస్తోందని.. స్పెల్లింగ్‌లు, చిరునామాలు తనిఖీ చేస్తున్నారన్నారు. అక్రమ ఎన్నికల ద్వారా విజయం సాధించాలని చూస్తున్నారని విమర్శించారు. అయినా ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని.. ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Ghaziabad Case: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీ ఏంటంటే..!

త్వరలో దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ‘సర్’ నిర్వహించింది. డిసెంబర్‌లో ముసాయిదా విడుదల చేసినప్పుడు తమిళనాడులో 97 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లుగా ప్రకటించింది. వారంతా చనిపోయారని/ బదిలీ చేయబడ్డారని పేర్కొంది. అనంతరం 1.90 కోట్ల మంది ఓటర్లుగా ఉన్నట్లు తెలిపింది. తుది జాబితా ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ రానుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Israel-Iran: ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు.. వీడియో వైరల్

మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. గత నెల 28న ప్రారంభమైన...

Glenn Phillips : బుమ్రా కూడా మనిషే.. న్యూజిలాండ్ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో...

Off The Record: శ్రీకాకుళం డయేరియా ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుందా..?

Off The Record: శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల ప్రబలిన అతిసారకు ఇద్దరు...

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్‌ మారాయ్..

హిందూపూర్ స్టేషన్‌లో కాచిగూడ–యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు చేస్తూ...