ఇద్దరి ఇష్టంతో జరిగితేనే అది పెళ్లి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా, తమ కూతురుకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని కొందరు తల్లిదండ్రులు వయసు ఎక్కువగా ఉన్నవారికిచ్చి పెళ్లిల్లు చేయడం ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవడం చూస్తు్న్నాం. ఈడుజోడు కలవాలి, అభిప్రాయాలు ఒక్కటవ్వాలి అనే విషయాలను పట్టించుకోకపోవడం వల్ల పెళ్లిల్లు పెటాకులు అవుతున్నాయి. ఈ క్రమంలో కాకినాడలో 23 ఏళ్ల యువతితో 42 ఏళ్ల వ్యక్తి పెళ్లికి సిద్ధమయ్యాడు. పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
Also Read:CM Revanth Reddy: మూసి పునరుజ్జీవం చేస్తామంటే.. బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటోంది
అన్నవరం సత్యదేవుని ఆలయంలో పెళ్లికూతురికి ఇష్టం లేని పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు ఆమె తల్లిదండ్రులు. 23 ఏళ్ల సుమతి కి 42 ఏళ్ల వెంకటరమణ తో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ పెళ్లి ఇష్టం లేని ఆ యువతి ఏడవడం ప్రారంభించింది. ఇది గమనించిన ఆలయ సిబ్బంది పెళ్లిని అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి తల్లిదండ్రులను ఆరా తీయగా మా ఆర్థిక పరిస్థితి బాగాలేక అమ్మాయికి పెళ్లి చేస్తున్నామని వధువు తల్లిదండ్రులు చెప్పారు. యువతికి ఇష్టం లేని పెళ్లి చేయవద్దని కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు వారిని అక్కడి నుంచి పంపిచారు.