Jyothula Nehru: రేషన్ బియ్యం పంపిణీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. కాకినాడ పోర్ట్ లో పట్టుబడిన రేషన్ బియ్యం వ్యవహారం చల్లబడిపోయింది అంటున్నారు.. అసలు ఎందుకు చల్లబడిందో.. ఎలా చల్లబడిందో.. ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలి అన్నారు.. ఈ వ్యవహారంపై సివిల్ సప్లై మంత్రి స్టేట్‌మెంట్లకే పరిమితం కాకూడదు.. రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు.. 30 రూపాయలు బియ్యాన్ని రూపాయికి ఇమ్మని ఎవరు చెప్పారు..? అని ప్రశ్నించారు.. కొందరు దుర్మార్గులు రేషన్ మీద ఇల్లీగల్‌గా సంపాదించి మన మీద పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు.. వారికి మనమే అవకాశం ఇస్తున్నాం.. విజిలెన్స్ విచారణ, కేసులు వలన ఏంటి ఉపయోగం? అని నిలదీశారు..
Read Also: Hydraa: హఫీజ్పేట్, ఇంజాపూర్లలో హైడ్రా కూల్చివేతలు..
అయితే, 80 శాతం ప్రజలు సన్న బియ్యం తినడానికి అలవాటు పడ్డారు అన్నారు జ్యోతుల నెహ్రూ.. తినే బియ్యం ఇస్తే ప్రజలు ఎందుకు అమ్ముకుంటారు? అని ప్రశ్నించారు.. ఉచితంగా బియ్యం ఇమ్మని ఎవరు అడిగారు? 50 శాతం సబ్సిడీతో సన్న బియ్యం ఇస్తే ప్రజలు కొనుక్కోలేరా? రేషన్ బియ్యం కేజీ కి 13 రూపాయలు ఇచ్చేస్తామంటే సరిపోతుందా? అంటూ హాట్ కామెంట్లు చేశారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. కాగా, అప్పట్లో కాకినాడ పోర్ట్‌లో రేషన్ బియ్యం వ్యవహారం సంచలనంగా మారింది.. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వాటిపై చర్చ సాగినా.. కొంతకాలంగా దీనిపై ఎలాంటి కామెంట్లు వినపడం లేదు.. దీంతో.. జ్యోతుల నెహ్రూ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి..