JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 21-24 మధ్య భారత్ సందర్శించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉపాధ్యక్షుడి భార్య ఉషా వాన్స్ కూడా ఆయన వెంట ఉండనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశాలు ఉంటాయని, అధికారిక కార్యక్రమాలతో పాటు జైపూర్, ఆగ్రాలను సందర్శించవచ్చని తెలుస్తోంది.
Read Also: Vishwambhara vs Mass Jathara : చిరంజీవి వర్సెస్ రవితేజ.. బాక్సాఫీస్ క్లాష్ తప్పదా..?
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) మైక్ వాల్ట్జ్ కూడా వీరితో పాటు భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఉషా వాన్స్ భారత సంతతి అమెరికన్. ఆమె అమెరికా రెండో మహిళగా తన స్వదేశానికి మొదటిసారిగా వస్తోంది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది.