10
April, 2026

A News 365Times Venture

10
Friday
April, 2026

A News 365Times Venture

Jananayagan : ‘జననాయగన్’ సినిమాను సోషియల్ మిడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు

Date:

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు దశాబ్దాల సినీ ప్రస్థానంలో అశేషమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఆయన, రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు. అయితే, రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్న విజయ్.. తన చివరి చిత్రంగా జననాయగన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే తాజాగా చిత్ర యూనిట్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది.

Also Read : Vaazha 2 : బడ్జెట్ రూ. 10 కోట్లు.. కలెక్షన్స్ రూ. 100 కోట్లు మలయాళంలో సెకండ్ హిట్ అందుకున్న సాహు గారపాటి

 మొదట ఈ సినిమాకు సంబంధించిన ఒక 5 నిమిషాల నిడివి గల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో విజయ్ ఇంట్రడక్షన్ సీన్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉండటంతో మేకర్స్ షాక్‌కు గురయ్యారు. అది చిన్న లీక్ అనుకునేలోపే, మొత్తం సినిమా 4K HD వెర్షన్ పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షం కావడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఇప్పటికే సెన్సార్ బోర్డు సమస్యలు ఇతర న్యాయపరమైన చిక్కులతో 2026 ప్రారంభంలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా సినిమానే లీక్ అవ్వడం చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది.ఈ లీకులపై కె.వి.ఎన్ (KVN) ప్రొడక్షన్స్ సంస్థ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేస్తూ సోషల్ మీడియా వేదికగా సినిమా క్లిప్పులను షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘జననాయగన్’ సినిమాను సోషల్ మీడియాలో షేర్ చేసినా లేదా ప్రసారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని KVN నిర్మాణ సంస్థ తరపు లాయర్ స్పష్టం చేసారు. అభిమానులు కూడా ఈ అక్రమ చర్యలను అరికట్టాలని తమ అభిమాన హీరో చివరి సినిమాను థియేటర్లలోనే చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చర్యలు విజయ్ అభిమానులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఏదేమైనా ఒక పవర్ ఫుల్ పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ‘జననాయగన్’ ఈ అడ్డంకులన్నీ దాటుకుని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

సాయంత్రం వేళ ఆకలి వేసినప్పుడు లేదా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వెరైటీగా...

Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

Love Attack: కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైదుకూరు సమీపంలోని...

Realme C100 4G: 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. కొత్త రియల్‌మీ ఫోన్ విడుదల

రియల్‌మీ సి100 4జి అనే కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను వియత్నాంలో విడుదల...

MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహాకుంభమేళాలో తేనె కళ్లతో మంత్ర ముగ్ధులను...