12
March, 2026

A News 365Times Venture

12
Thursday
March, 2026

A News 365Times Venture

Ishan Kishan: ఇలా రెచ్చిపోయావేంటి భయ్యా.. బౌలర్లకు చుక్కలు చూపిన ఇషాన్ కిషన్.. నయా రికార్డ్!

Date:

Ishan Kishan: తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బ్యాట్‌తో ఊచకోత మొదలుపెట్టి, న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూయించాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన ఇషాన్, కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆరు ఫోర్లు, పది సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఒక్కో షాట్ ను అభిమానులు ఉత్సాహంతో ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ తన కెరీర్‌లో తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. 28 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ఇషాన్ అంతటితో ఆగలేదు. మరింత దూకుడు పెంచి కేవలం 42 బంతుల్లోనే తన తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. యువ ఆటగాడిగా ఈ ఘనత సాధించడం నిజంగా విశేషం.

READ MORE: IND vs NZ 5th T20: ఇషాన్ ఊచకోత.. కివీస్ టార్గెట్ ఎంతంటే?

మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన స్టైల్‌కు తగ్గట్టే ఆడాడు. 30 బంతుల్లో 63 పరుగులు చేసి, ఇషాన్‌కు పూర్తి మద్దతుగా నిలిచాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు కేవలం 57 బంతుల్లోనే 137 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ పార్ట్‌నర్‌షిప్‌తో భారత స్కోర్ బోర్డు వేగంగా పరుగులు పెరిగింది. అంతకుముందు అభిషేక్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చాడు. సంజూ శాంసన్ మాత్రం ఈసారి పెద్దగా రాణించలేక పోయాడు. కేవలం ఆరు బంతుల్లో ఆరు పరుగులకే అవుటయ్యాడు. మ్యాచ్‌కు ముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బ్యాటింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయంగానే మారింది. పిచ్‌పై బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాట్స్‌మెన్ ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఇషాన్, సూర్యకుమార్ లాంటి ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ 272 పరుగుల లక్ష్యాన్ని చేరుకోగలదా? వేచిచూద్దాం..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Half Day Schools: విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. ఒంటిపూట బడులు వచ్చేశాయ్.. ఎప్పటి నుంచంటే..

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం...

Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Supreme Court: 10 మంది పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు...

Telugu Cinema : వెండితెరకు ‘రక్తాభిషేకం’ మితిమీరిన వైలెన్స్‌తో హిట్లు వస్తాయా?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం ఒకటే ట్రెండ్ నడుస్తోంది. అదే...

Dark Spots: ముఖంపై నల్లటి మచ్చలా?.. ఈ హోమ్ రెమిడీస్‌తో ప్రాబ్లం క్లియర్!

అందమైన ముఖంలో నల్లటి మచ్చలు మానసిక వేధనకు గురిచేస్తుంటాయి. ఈ మచ్చలను...