మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా హెచ్చరించినట్లుగానే ఇరాన్‌పై యుద్ధం మొదలైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది. టెహ్రాన్ అంతటా అనేక పేలుళ్లు సంభవించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఇజ్రాయెల్‌పై కూడా ప్రతీకార దాడులకు ఇరాన్ సిద్ధపడుతోంది. దీంతో టెల్ అవీవ్‌లో సైరన్ల మోత మోగుతోంది. ప్రజలను ఇజ్రాయెల్ అప్రమత్తం చేసింది. ఇరాన్‌పై క్షిపణి దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. ఇరాన్‌పై ముందస్తు దాడిని ప్రారంభించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా తక్షణ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.




