4
March, 2026

A News 365Times Venture

4
Wednesday
March, 2026

A News 365Times Venture

Iran: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఎన్నిక.. సవాళ్లను ఎదుర్కోగలరా?

Date:

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా అలీ ఖమేనీ (56) ఎన్నికయ్యారు. 80 మందితో కూడిన పండితుల కమిటీ మోజ్తబా పేరును ఆమోదించినట్లుగా ఇరాన్ మీడియా పేర్కొంది. చాలా కాలంగా తండ్రి ఖమేనీ వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఖమేనీ వారసుడిగా మోజ్తబానే అవుతారని ప్రచారం కూడా ఉంది.

విచ్ఛన్నమైన దేశాన్ని ఏకం చేయడంలో.. నాయకత్వాన్ని ఏకతాటిపైకి తీసుకురాగల సత్తా మోజ్తబాకే ఉంటుందని కమిటీ విశ్వసించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఇంకోవైపు నిరుద్యోగం, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం.. ఈ పరిణామాలను ఎలా డీల్ చేయగలరన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మెజ్తబా యుద్ధానికి ముగింపు పలుకుతారా? లేదంటే తండ్రి ఖమేనీలాగానే ముందుకు తీసుకెళ్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

మోజ్తబా..
మోజ్తబా ఖమేనీ 1969లో ఇరాన్‌లోని మష్హాద్‌లో జన్మించారు. మతపరమైన విద్యను అభ్యషించారు. అలాగే హుజ్జతుల్-ఇస్లాం బిరుదును పొందారు. మోజ్తబా ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు మోజ్తబా ఖమేనీ ఎటువంటి ప్రభుత్వ పదవిని చేపట్టలేదు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఎన్నికయ్యారు.

మోజ్తబా తండ్రికి నీడలా ఉండే వ్యక్తిగా పనిచేశాడు. ఇరాన్‌లో అధికార పీఠమైన తన తండ్రి కార్యాలయం, బీట్-ఎ రహ్బరి పనితీరులో కీలక పాత్ర పోషించారు. ఇరాన్ సాయుధ దళాలు, రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, మిలీషియా, బాసిజ్‌పై కూడా పరోక్ష నియంత్రణ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Revanth Reddy: అమిత్ షా తో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర...

SA vs NZ: ఫిన్ అలెన్ అజేయ సెంచరీ.. న్యూజిలాండ్ 9 వికెట్ల భారీ విజయంతో ఫైనల్‌కు

బుధవారం (మార్చి 4) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన T20 ప్రపంచ...

Telangana Rajya Sabha Candidates: తెలంగాణ నుంచి రాజ్యసభకు వేం నరేందర్‌రెడ్డి, సింఘ్వి..

తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉత్కంఠకు తెరపడింది. అధికార...

Dommeti Sambayya: రాజ్యసభ అభ్యర్థి రేసులో దొమ్మాటి సాంబయ్య

తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి అధికార కాంగ్రెస్...