IPL 2026 Twist: ఐపీఎల్ 2026 జరుగుతున్న సమయంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) తాజాగా విడుదల చేసిన రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (RTP) జాబితాలో అక్షర్ పటేల్(Axar Patel), అభిషేక్ శర్మ (Abhishek Sharma) లను చేర్చింది. ఈ నిర్ణయంతో ఇప్పటి నుండి ఇద్దరు ఆటగాళ్లపై కఠినమైన యాంటీ డోపింగ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వైస్ కెప్టెన్ అభిషేక్ శర్మ ఇకపై తమ లొకేషన్ వివరాలను నిరంతరం అందిస్తూ, పరీక్షలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. RTPలో చేరడం అంటే.. ఆటగాళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండటం. ఈ జాబితాలో ఉన్న క్రీడాకారులు ప్రతిరోజూ తమ ఉన్న ప్రదేశం వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఎప్పుడైనా అవుట్-ఆఫ్-కాంపిటిషన్ టెస్టింగ్ నిర్వహించడానికి అధికారులు సులభంగా వీలుపడుతుంది. ఒకవేళ ఆటగాడు మూడు సార్లు తన లొకేషన్ వివరాలను ఇవ్వడంలో విఫలమైతే, అది డోపింగ్ ఉల్లంఘనగా పరిగణిస్తారు. అలాగే పరీక్షలో నెగటివ్ వచ్చినా కూడా..
Pakistan Cricket: పాక్ జట్టులో కలకలం.. కోచింగ్, కెప్టెన్సీలపై కీలక నిర్ణయం..!
తాజా RTP జాబితాలో మొత్తం 348 మంది క్రీడాకారులు ఉన్నారు. అందులో 14 మంది క్రికెటర్లు ఉండడం ఆశర్యం వ్యక్తం అవుతుంది. ఈ సారి జాబితాలో అక్షర్ పటేల్, అభిషేక్ శర్మలు చేరగా.. వారి స్థానాల్లో ముందుగా ఉన్న స్మృతి మందాన, శ్రేయస్ అయ్యర్ పేర్లు తొలిగించబడ్డాయి. అయితే ఈ లిస్ట్ లో ఇంకా పలువురు ప్రముఖ భారత క్రికెటర్లు కూడా ఈ జాబితాలో కొనసాగుతున్నారు. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు ఇందులో ఉన్నారు. మరోవైపు మహిళల విభాగంలో దీప్తి శర్మ, షఫాలి వర్మ, రేణుకా సింగ్ ఠాకూర్ లు కూడా ఈ లిస్ట్ లో కొనసాగుతున్నారు.
క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ RTP జాబితా భారీగా ఉంది. ముఖ్యంగా అథ్లెటిక్స్ విభాగంలో 134 మంది క్రీడాకారులు ఉన్నారు. అవినాష్ సాబ్లే, జ్యోతి యర్రాజీ, తేజస్విన్ శంకర్, అమియా మల్లిక్ వంటి ప్రముఖులు ఇందులో ఉన్నారు. అలాగే ఆర్చరీలో ఆర్చరీలో దీపికా కుమారి, షీతల్ దేవి, హాకీలో మన్‌ప్రీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్య సేన్, బాక్సింగ్‌లో నిఖత్ జరీన్, లోవ్లీనా బోర్గోహైన్ వంటి క్రీడాకారులు కూడా RTPలో ఉన్నారు.
Film Tittle: ఒక్క సినిమా టైటిల్ కోసం రూ.112 కోట్లు.. బాబోయ్ అంత డిమాండ్ ఉందా..?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. RTPలో చేర్చడం అనేది కేవలం యాంటీ డోపింగ్ నియమాల అమలు కోసం తీసుకునే సాధారణ చర్య మాత్రమే. దీనిని ఎలాంటి తప్పిదం లేదా వివాదంగా పరిగణించాల్సిన అవసరం లేదు. క్రీడల్లో పారదర్శకత, న్యాయం కాపాడేందుకు ఈ విధానం ఎంతగానో కీలకం. ఈ దెబ్బతో IPL 2026లో ఆడుతున్న అక్షర్ పటేల్, అభిషేక్ శర్మలు మైదానంలో ప్రదర్శనతో పాటు.. మైదానం బయట కూడా కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.




