23
February, 2026

A News 365Times Venture

23
Monday
February, 2026

A News 365Times Venture

IPL 2026: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్? తలా ఫ్యాన్స్‌కు సీఎస్‌కే సీఈఓ ఇచ్చిన షాకింగ్ అప్‌డేట్ ఇదే!

Date:

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్ధమవుతున్న వేళ, తలా అభిమానులకు ఉత్కంఠతో ఒక విషయం గురించి ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసా.. ఈ సీజన్‌లో ఎంఎస్ ధోనీ మళ్లీ మైదనంలోకి అడుగుపెడతాడా లేదా అనేది. తాజాగా క్రికెట్ అభిమానులకు అత్యంత సంతోషకరమైన వార్త అందింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘తలా’ ఎంఎస్ ధోనీ రాబోయే సీజన్‌లో బరిలోకి దిగడం ఖాయమైంది. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టమైన ప్రకటన చేశారు.

READ ALSO: India vs South Africa: మిల్లర్ దూకుడు.. బుమ్రా పంజా! సూపర్ 8లో టీమిండియాకు తప్పని అగ్ని పరీక్ష!

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోనీ, ధోనీ అంటే సీఎస్‌కే అన్నంతగా ఫ్యాన్స్ నమ్ముతారు. 44 ఏళ్ల వయసులో కూడా ధోనీ మైదానంలోకి వస్తున్నాడంటే ఆ క్రేజే వేరు. అయితే, గత కొంతకాలంగా ధోనీ రిటైర్మెంట్‌పై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వీటన్నింటికీ తెరదించుతూ, చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాథన్ ఒక జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “ధోనీ తప్పకుండా వచ్చే సీజన్ ఆడతాడు” అని స్పష్టం చేశారు. దీంతో మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సమరంలో ధోనీ హెలికాప్టర్ షాట్లను చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కెప్టెన్సీ మార్పుపై ఉత్కంఠ..
ఐదుసార్లు చెన్నైకి టైటిల్ అందించి, విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ధోనీ, ఇప్పటికే సారథ్య బాధ్యతలను యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి మెగా వేలానికి ముందు చెన్నై జట్టులోకి సంజు శాంసన్ చేరడం ఆసక్తికరంగా మారింది. సంజు రాకతో జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే చర్చ మొదలైంది. రుతురాజ్ కొనసాగుతారా లేదా సంజు శాంసన్‌కు పగ్గాలు అప్పగిస్తారా అనేది చూడాలి.

READ ALSO: Harish Shankar: పవన్ కల్యాణ్ నిజాయతీపై హరీశ్ శంకర్ సెన్సేషనల్ కామెంట్స్..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

US: అమెరికాను ముంచెత్తిన మంచు తుఫాన్.. 10 వేలకు పైగా విమానాలు రద్దు

అగ్ర రాజ్యం అమెరికాను మంచు తుఫాన్ గడగడలాడిస్తోంది. అనేక రాష్ట్రాల్లో మంచు...

Astrology: ఫిబ్రవరి 23, సోమవారం దినఫలాలు..

NTV Daily Astrology as on 23rd February 2026: ఈ...

Jammu Kashmir Encounter: 20 సార్లు తప్పించుకున్నాడు, ఈసారి కుక్కచావు.. జైష్ ఉగ్రవాది సైఫుల్లా అంతం..

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం...

Jasprit Bumrah: బుమ్రా నయా హిస్టరీ.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో టాప్ వికెట్ టేకర్‌గా యార్కర్ కింగ్..

Jasprit Bumrah: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా vs...