IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో టేబుల్ సెకెండ్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ గాయపంతో టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. ఇక, అతడికి ప్రత్యామ్నాయ ఆటగాడిగా శ్రీలంక పరిమిత ఓవర్ల మాజీ కెప్టెన్ దసున్ షనకను తీసుకుంది. అయితే, షనక 2023 సీజన్లో కూడా గుజరాత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్ మెగా వేలంలో అతడు అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయినప్పటికీ.. ఫిలిప్స్ గాయపడటంతో షనకను 75 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్.
Read Also: Bhopal: భార్య చేతిలో మరో భర్త బలి.. బైక్‌పై వెళ్తూ ఏం చేసిందంటే..!
కాగా, దసుక షనక త్వరలోనే గుజరాత్ టైటాన్స్‌తో జతకట్టనున్నాడు. ఇక, 2023 సీజన్లో గుజరాత్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడిన షనక కేవలం 26 పరుగులే చేశాడు. ఆల్‌రౌండర్ అయిన అతడు ఆ సీజన్లో బౌలింగ్ చేసే ఛాన్స్ రాలేదు. అయితే, ఈ ఏడాది ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (దుబాయ్) టైటిల్ గెలిచిన దుబాయ్ క్యాపిటల్స్ జట్టులో షనక సభ్యుడిగా ఉన్నాడు. కాగా, శ్రీలంక తరఫున 6 టెస్ట్‌లు, 71 వన్డేలు, 102 టీ20లు ఆడిన షనక.. టెస్ట్‌ల్లో ఓ హాఫ్ సెంచరీతో పాటు 13 వికెట్లు తీసుకోగా.. వన్డేల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు, 27 వికెట్లు ఉన్నాయి. ఇక, టీ20ల్లో 5 హాఫ్ సెంచరీలు, 33 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, దసున్ షనక వన్డేల్లో ఒకసారి ఐదు వికెట్లు కూడా తీసుకున్నాడు.