23
March, 2026

A News 365Times Venture

23
Monday
March, 2026

A News 365Times Venture

Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

Date:

విశాఖపట్నం నగర వాసులకు శుభవార్త. నగర నడిబొడ్డున ఉన్న సాలిగ్రామపురంలో ‘ఇన్ఆర్బిట్ మాల్’ అట్టహాసంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దాదాపు 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మాల్, ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మాల్‌లో షాపింగ్ ప్రియుల కోసం ఫ్యాషన్, పాదరక్షలు, నగలు, వాచీలు, ఎలక్ట్రానిక్స్, సౌందర్య సాధనాలకు సంబంధించిన 350కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా షాపర్స్ స్టాప్, H అండ్ M, ప్యాంటలూన్స్, శామ్సంగ్, మలబార్ గోల్డ్ వంటి ప్రముఖ సంస్థలు తమ స్టోర్లను ఇక్కడ ఏర్పాటు చేశాయి.

సినిమా ప్రియుల కోసం ఇక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన 8 స్క్రీన్ల మల్టీప్లెక్స్ ఉంది. ఇందులో ముఖ్యంగా AAA (ఏషియన్ అల్లు అర్జున్) సినిమాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పిల్లల కోసం 5 రకాల ఎంటర్టైన్మెంట్ సెంటర్లు, రుచికరమైన ఆహారాన్ని అందించే ఫుడ్ కోర్ట్ , రెస్టారెంట్లు ఇక్కడ ఉన్నాయి.

Also Read:Ganja Murders: మత్తులో మృగాళ్లు.. భాగ్యనగరంలో గంజాయి బ్యాచ్‌ల వీరంగం.. రెండు రోజుల్లో ఇద్దరి బలి!

ఈ మాల్ కేవలం షాపింగ్ కోసమే కాకుండా.. ప్రజలు ఒకచోట చేరి సరదాగా గడిపేలా రూపొందించబడింది. వాహనాల పార్కింగ్ కోసం ఏకంగా 7 అంతస్తులను కేటాయించారు. అలాగే.. వ్యాయామం కోసం 1.1 కిలోమీటర్ల పొడవైన జోగింగ్ ట్రాక్, పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా ‘పెట్ పార్క్’, నగర అందాలను చూసేందుకు వీలుగా పైకప్పు మీద టెర్రస్ డెక్ ఏర్పాటు చేశారు. పర్యావరణ హితంగా నిర్మించినందుకు ఈ మాల్‌కు ‘లీడ్ (LEED) గోల్డ్ సర్టిఫికేషన్’ లభించింది. అలాగే భద్రతా ప్రమాణాల విషయంలో బ్రిటిష్ కౌన్సిల్ నుండి అవార్డును కూడా అందుకుంది.

కె. రహేజా కార్ప్ ప్రతినిధులు నీల్ రహేజా, రజనీష్ మహాజన్ మాట్లాడుతూ.. విశాఖ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఈ మాల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఇది ప్రజలకు ఒక సరికొత్త జీవనశైలిని అందిస్తుందని తెలిపారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

Double Bedroom House Scam: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. కానీ...

Coca‑Cola Price: యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న కోకా కోలా ధరలు..

భారతదేశంలో కోకా కోలా ఉత్పత్తులను బాటిలింగ్  చేసే ప్రధాన సంస్థ ఎస్ఎల్ఎంజీ...

Ragi Chapati: షుగర్‌కు చెక్.. బరువు తగ్గడానికి బెస్ట్ మంత్రం.. ఈ స్టైల్‌లో రాగి చపాతీ తింటే ఫలితం పక్కా!

Ragi Chapati: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం...

Iran Counter: అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు.. ‘ట్రంప్ భయపడ్డాడు’.. ఇరాన్ కౌంటర్..

అమెరికా , ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు...