22
February, 2026

A News 365Times Venture

22
Sunday
February, 2026

A News 365Times Venture

India vs South Africa: సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం.. సన్నగిల్లిన సెమీస్ ఆశలు!

Date:

India vs South Africa: సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత జట్టు సూపర్ 8లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. 188 లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సూర్య సైన్యం 111 పరుగులకే కుప్పకూలిపోయింది. ఒక్క శివమ్ దూబే(42) మాత్రమే చివరి వరకు పోరాడాడు. కానీ.. సరైన పాట్నర్ లేకపోవడంతో ఏం చేయలేకపోయాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా 187 పరుగులు చేసింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. తొలి ఓవర్‌లోనే ఐడెన్ మార్క్రమ్ వేసిన ఆఫ్ బ్రేక్ బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించిన కిషన్(0) రియన్ రికెల్టన్ చేతికి చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్లోనే జాన్సెన్ తిలక్ వర్మను అవుట్ చేశాడు. సూర్య, అభిషేక్‌ల నుంచి భారీ భాగస్వామ్యం ఆశించనా ఫలితం లేకుండా పోయింది. అభిషేక్ మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో జాన్సెన్ అభిషేక్‌(15)ను అవుట్ చేశాడు. ఆరు ఓవర్ల తర్వాత, భారత స్కోరు 31-3కి పడిపోయింది. ఆ తర్వాత ఎనిమిదో ఓవర్లో వాషింగ్టన్ సుందర్ 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తొమ్మిదో ఓవర్లో భారత్ 50 పరుగుల మార్కును దాటింది.

READ MORE: Jasprit Bumrah: బుమ్రా నయా హిస్టరీ.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో టాప్ వికెట్ టేకర్‌గా యార్కర్ కింగ్..

10వ ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 18 పరుగులు) ఔటవ్వడంతో టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. 10 ఓవర్ల తర్వాత భారత్ 57-5కి పరిమితమైంది. 15వ ఓవర్లో కేశవ్ మహారాజ్ హార్దిక్‌(18), రింకు సింగ్‌(0)ను అవుట్ చేశాడు. అదే ఓవర్లో కేశవ్ అర్ష్ దీప్‌(1)ను సైతం పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఒకే ఓవరల్‌లో కేశవ్ మొత్తం మూడు వికెట్లు పడగొట్టాడు. శివం దూబే 42 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ టీం ఇండియా 19వ ఓవర్లో 111 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమి భారత రన్ రేట్ -3.80కి తగ్గింది. దీని అర్థం భారతదేశం తదుపరి రెండు మ్యాచ్‌లను గణనీయమైన తేడాతో గెలవాలి. భారతదేశం సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలు ఈ ఓటమితో తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు.. దక్షిణాఫ్రికా తరఫున జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, లుంగి మూడు, బాష్ రెండు వికెట్లు పడగొట్టారు.

READ MORE: India vs South Africa: మిల్లర్ దూకుడు.. బుమ్రా పంజా! సూపర్ 8లో టీమిండియాకు తప్పని అగ్ని పరీక్ష!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

IPL 2026: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్? తలా ఫ్యాన్స్‌కు సీఎస్‌కే సీఈఓ ఇచ్చిన షాకింగ్ అప్‌డేట్ ఇదే!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్ధమవుతున్న వేళ, తలా...

Jasprit Bumrah: బుమ్రా నయా హిస్టరీ.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో టాప్ వికెట్ టేకర్‌గా యార్కర్ కింగ్..

Jasprit Bumrah: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా vs...

USA: అమెరికాలో మెరిసిన పెద్దపల్లి కళాకారుడు.. మహాభారత చిత్రంతో అదరగొట్టిన తెలుగోడు..

USA: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సింగాపు శివరామకృష్ణ అమెరికాలో అద్భుతమై...

Hindus: అమెరికాలో విద్యాధికులు హిందువులే..

Hindus: అమెరికాలో అత్యధిక విద్యావంతులు హిందువులే అని తాజా అధ్యయనం ఒకటి...