9
March, 2026

A News 365Times Venture

9
Monday
March, 2026

A News 365Times Venture

India vs New Zealand: అభిషేక్ ఊచకోత.. వరల్డ్ కప్ నాకౌట్‌లో ‘యువీ’ రికార్డు బద్ధలు! పవర్ ప్లేలో ప్రపంచ రికార్డు..

Date:

India vs New Zealand: టీ20 వరల్డ్ కప్‌లో నంబర్ 1 ర్యాంక్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ, గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 89 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్ వంటి దిగ్గజాలు కూడా “అతడిని జట్టు నుంచి తప్పించండి” అని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు సూచించారు. కానీ, గంభీర్, టీమ్ మేనేజ్మెంట్ అభిషేక్ మీద నమ్మకం ఉంచారు. 2024 వరల్డ్ కప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ ఎలాగైతే తన బ్యాట్‌తో సమాధానం చెప్పారో, సరిగ్గా అలాగే అభిషేక్ కూడా విశ్వవేదికపై విమర్శకుల నోళ్లు మూయించారు.

READ ALSO: Bellamkonda Sai Sreenivas: సాయి శ్రీనివాస్ మనసు దోచిన కావ్య ఎవరు? బెల్లంకొండ వారి ఇంట్లో మొదలైన పెళ్లి సందడి!

అభిషేక్ శర్మకు ఆఫ్ స్పిన్ అంటే ఇబ్బంది అని తెలిసినా, న్యూజిలాండ్ జట్టు స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్ కోల్ మెక్కాన్చీని తుది జట్టులోకి తీసుకోకుండా తప్పు చేసింది. పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో తొలుత జాగ్రత్తగా ఆడిన అభిషేక్, కివీస్ బౌలర్ల లయ తప్పగానే విరుచుకుపడ్డారు. భారత ఓపెనర్లు ఆరంభం నుంచే కివీస్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు (6 ఫోర్లు, 3 సిక్సర్లు) పూర్తి చేసిన అభిషేక్ శర్మ, టీ20 వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఈ క్రమంలో అభిషేక్ తన మెంటర్ యువరాజ్ సింగ్ (2007లో ఆస్ట్రేలియాపై 20 బంతుల్లో 50) రికార్డును అధిగమించారు. ఈ టోర్నీ సెమీఫైనల్స్‌లో జాకబ్ బెథెల్, ఫిన్ అలెన్ నెలకొల్పిన 19 బంతుల రికార్డును కూడా తుడిచిపెట్టాడు.

అభిషేక్ శర్మ విధ్వంసానికి సంజూ శాంసన్ మెరుపులు కూడా తోడవడంతో, టీమిండియా పవర్ ప్లే (మొదటి 6 ఓవర్లు) ముగిసేసరికి 92 పరుగులు రాబట్టింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టుకైనా పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 2024 ఫైనల్‌లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌లాగే ఇది భారత్‌కు కప్పును అందిస్తుందో లేదో చూడాలి. కానీ, విమర్శల మధ్య నలిగిపోయిన ఒక యువ ఆటగాడు, కీలక సమయంలో జట్టుకు అద్భుతమైన పునాది వేసి తన విలువేంటో నిరూపించుకున్నారు.

READ ALSO: Actor Sivaji: ‘దండోరా’ ఇక్కడితో ఆగే సినిమా కాదు.. మున్ముందు చాలా అవార్డులు వస్తాయి: శివాజీ

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Aishwarya Rai-Abhishek: పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట.. వీడియో వైరల్

ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ దంపతులు సందడి...

IND vs NZ: 17 ఏళ్ల పాకిస్థాన్ రికార్డు బ్రేక్.. T20 వరల్డ్ కప్ హిస్టరీలో నంబర్ 1 జోడీగా సంజు-అభిషేక్

2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ,...