1
March, 2026

A News 365Times Venture

1
Sunday
March, 2026

A News 365Times Venture

IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

Date:

T20 World Cup : టీ20 వరల్డ్ కప్‌లో భారత్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సంజు శాంసన్ తన కెరీర్‌లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. సూర్య (18) త్వరగానే అవుట్ అయినప్పటికీ, శాంసన్ ఏమాత్రం తడబడకుండా విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ ఛేజింగ్‌లో ఒక భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరుగా శాంసన్ రికార్డు సృష్టించాడు.

Ind vs WI: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న సూర్య.. రింకూకు నో ఛాన్స్.. వెస్టిండీస్ జట్టులో కీలక మార్పు!

శాంసన్‌కు తోడుగా యువ ఆటగాడు తిలక్ వర్మ (15 బంతుల్లో 27 పరుగులు 4 ఫోర్లు, 1 సిక్సర్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (17) కీలక సమయంలో అవుట్ అవ్వగా, శివం దూబే (8*) వరుసగా రెండు ఫోర్లు బాది ఒత్తిడిని తగ్గించాడు. చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరమైన దశలో రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో శాంసన్ ఒక సిక్సర్, ఒక ఫోర్ బాది 199 పరుగులతో విజయకేతనం ఎగురవేశాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండీస్ బ్యాటర్లు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నప్పటికీ, భారత బ్యాటింగ్ పటిమ ముందు ఆ స్కోరు సరిపోలేదు. విండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్, జేసన్ హోల్డర్ తలో రెండు వికెట్లు తీశారు. అయితే ఆఖరి ఓవర్లలో ఓవర్ రేట్ పెనాల్టీ కారణంగా విండీస్ అదనపు ఫీల్డర్‌ను సర్కిల్‌లో ఉంచాల్సి రావడం భారత్‌కు కలిసొచ్చింది. ఈ విజయంతో వెస్టిండీస్ వరల్డ్ కప్ ప్రయాణం ముగియగా, భారత్ సగర్వంగా సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. అత ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంసన్ మ్యాచ్ హీరోగా నిలిచాడు. గెలుపు అనంతరం శాంసన్ మోకాళ్లపై కూర్చుని తన హెల్మెట్ తీసి ప్రార్థన చేసుకున్న దృశ్యం అభిమానులను ఆకట్టుకుంది.

Ranabaali Poster: ‘రణబాలి’ వెడ్డింగ్ పోస్టర్ వెనుక అసలు కథ ఇదే.. డైరెక్టర్ రాహుల్‌ సాంకృత్యన్‌ భావోద్వేగ పోస్ట్ వైరల్!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

IND vs WI: ఈడెన్‌లో వెస్టిండీస్ ప్లేయర్ల గర్జన.. భారత్ ముందు భారీ లక్ష్యం!

India vs West Indies Super 8: కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో...

Rakasa Teaser Talk: నవ్విస్తూనే భయపెడుతున్న సంగీత్ శోభన్.. రిలీజ్ డేట్ ఫిక్స్.!

Rakasa Teaser Talk in telugu : ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’...

UAE: “మీ యుద్ధం మాతో కాదు, తెలివిలోకి రండి”.. ఇరాన్‌పై యూఏఈ ఆగ్రహం..

UAE: అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా ఖమేనీ హతమయ్యారు....