14
February, 2026

A News 365Times Venture

14
Saturday
February, 2026

A News 365Times Venture

IND vs PAK: భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్.. తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్ వచ్చేనా..?

Date:

IND vs PAK: టీ20 వరల్డ్ కప్‌లో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో మార్పులపై ఆసక్తికర చర్చ మొదలైంది. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే, నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ భారీగా పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లు పూర్తి చేయలేదని గుర్తు చేశారు. మిగతా బౌలర్లు వికెట్లు సాధించారు. ఈ పరిణామాలు పాకిస్థాన్ మ్యాచ్ ని దృష్టిలో పెట్టుకుని జట్టు వ్యూహం మార్చవచ్చనే సంకేతాలు ఉన్నాయని గవాస్కర్ చెప్పారు.

Read Also: Pulwama Attack 2019: జవాన్ల త్యాగం.. భారత చరిత్రలో చెరగని ముద్ర.. 40 మంది పుల్వామా అమరుల పేర్లు ఇవే..

అయితే, శ్రీలంక పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని, భారత్‌ ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన చరిత్ర ఉందని సునీల్ గవాస్కర్ గుర్తు చేశారు. కొలంబోలో జరిగే పాక్ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడని అంచనా వేశారు. ఇక, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ మార్పులు కూడా దాయాది జట్టును దృష్టిలో పెట్టుకుని చేశారని ఆయన విశ్లేషించారు. హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్ వేయడం అర్ష్‌దీప్ స్థానంపై సందేహాలు వస్తున్నాయి. అలాగే, వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు వేసి ఉంటే ఐదు లేదా ఆరు వికెట్లు తీసేవాడని పేర్కొన్నారు. అక్షర్ పటేల్ మూడు ఓవర్లలో రెండు వికెట్లు తీయడం కూడా మంచి పరిణామం అని మాజీ క్రికెటర్ సునీల్ తెలిపారు.

Read Also: Bhopal: ప్రేమికుల రోజున దుర్వార్త.. ప్రేమికురాలిని చంపి సెప్టిక్ ట్యాంక్‌‌లో పడేసిన ప్రియుడు

ఇక, బ్యాటర్ సంజూ శాంసన్ ఆటపై కూడా గవాస్కర్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఉన్న అభిషేక్ శర్మ స్థానంలో వచ్చిన సంజూ, 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.. అతను క్రీజ్‌లో చాలా లోతుగా వెళ్లి ఫ్లిక్ షాట్ ఆడడం సాంకేతిక సమస్యగా మారుతోంది.. కొత్త బంతితో ఓపెనింగ్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఆడాల్సిన అవసరమని సూచించారు. అయితే, నమీబియా బౌలర్లు సంజూ కోసం ప్రత్యేక ఫీల్డింగ్ సెట్టింగ్ పెట్టారు.. అయినప్పటికీ కొన్ని అద్భుత షాట్లు ఆడటం అతనికి ఆత్మవిశ్వాసం ఇస్తుందన్నారు. పాక్ మ్యాచ్‌లో అవకాశం వస్తే క్రీజ్‌లో ఎక్కువ సమయం గడపాలని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Buggana Rajendranath Reddy: పెర్ఫామెన్స్ వీక్.. పబ్లిసిటీ పీక్.. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు..

Buggana Rajendranath Reddy: ఏపీ బడ్జెట్‌ 2026-27పై తీవ్ర స్థాయిలో విమర్శలు...

Khammam Politics : ఖమ్మం జిల్లా మున్సిపాలిటీల్లో క్యాంపు రాజకీయాలు

Khammam Municipal Politics : మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి ముగియడంతో...

Siddaramaiah: మెత్తబడ్డ సిద్ధరామయ్య.. అధికార మార్పుపై కీలక వ్యాఖ్యలు

కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార మార్పుపై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది....

Drishyam 3 : ఆఖరి ఆట మొదలైంది.. ‘దృశ్యం 3’ రిలీజ్ డేట్ ఫిక్స్!

క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసిన ‘దృశ్యం’...