పతియే ప్రత్యక్ష దైవం నుంచి భర్తను పరలోకాలకు పంపించే వరకు చేరింది భార్యల తీరు. పరాయి వ్యక్తుల మోజులో పడి కొందరు, కుటుంబ కలహాలతో మరికొందరు భర్తలను అంతమొందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. భర్తతో విసిగిపోయిన భార్య కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని పూడ్చి పెట్టింది. నేరం నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేసింది. కానీ, బంధువులు అనుమానంతో వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బయటపడింది.
Also Read:Gold : తులం బంగారానికి లక్ష.. అయినా ఆగట్లేదుగా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్ బీకి చెందిన సాయిలు, కవిత దంపతులు. గత 15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భార్యకు, భర్తకు ఇద్దరికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి. కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారు. అయితే, తరచుగా భార్య ఉంటున్న ఇంటికి వచ్చి సాయిలు వేధింపులకు పాల్పడే వాడని సమాచారం. దీంతో విసిగిపోయిన కవిత భర్తను లేకుండా చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు చెల్లెలు, చెల్లెలి భర్త సాయం తీసుకుంది.
Also Read:TG Inter Results: రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ పలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
ముగ్గురూ కలిసి ప్లాన్ చేసి సాయిలును కరెంట్ షాక్ తో చంపేశారు. ఆపై గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పాతిపెట్టి కవిత సొంతూరుకు వెళ్లిపోయింది. సాయిలు గురించి అడిగిన వారికి పనికి వెళ్లి తిరిగిరాలేదని చెప్పింది. అయితే, కవిత తీరు అనుమానాస్పదంగా ఉండడంతో సాయిలు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. కవితను ప్రశ్నించగా నేరం అంగీకరించింది. పోలీసులు కవితను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.