20
March, 2026

A News 365Times Venture

20
Friday
March, 2026

A News 365Times Venture

Hyderabad : మొదటి రోజు ఉద్యోగం చేసి వస్తుండగా ప్రమాదం.. యువ ఇంజనీర్ దుర్మరణం

Date:

హైదరాబాద్ నగరంలో మరోసారి హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నార్సింగిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో యువ ఇంజనీర్ నవీన్ చారీ ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ఆసక్తితో, ఆశలతో తన మొదటి ఉద్యోగం ప్రారంభించిన నవీన్ చారీ ఆ రోజు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. కోకాపేట్ టీ-గ్రీల్ వద్ద నవీన్ చారీ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం అతడిని వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు నవీన్ చారీ తీవ్ర గాయాల పాలయ్యాడు. రహదారిపై అపస్మారక స్థితిలో పడిపోయిన అతడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత.. 
డాక్టర్లు నవీన్ చారీని అత్యవసర చికిత్సకు తీసుకెళ్లినా, అతడి గాయాల తీవ్రత కారణంగా ప్రాణాలు కాపాడలేకపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే నవీన్ మృతి చెందాడు. ఈ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నార్సింగి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు.

కుటుంబం కన్నీటి  పర్యంతం.. 
నవీన్ చారి తల్లిదండ్రుల కోసం ఈ సంఘటన వర్ణనాతీత వేదనగా మారింది. ఎంతో కష్టపడి చదివించి, ఉద్యోగం చేయడానికి పంపిన కుమారుడు మొదటి రోజే శవమై ఇంటికి తిరిగి రావడం తల్లిదండ్రుల హృదయాలను ఛిద్రం చేసింది. “ఎన్ని కష్టాలు పడి చదివించామో.. ఉద్యోగం రావడం మాకు ఆనందంగా అనిపించింది.. కానీ మా కొడుకు శవమై ఇంటికి రావడం మేమెప్పటికీ జీర్ణించుకోలేం” అంటూ నవీన్ తల్లి, తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు.

హైదరాబాద్‌లో పెరుగుతున్న హిట్ అండ్ రన్ కేసులు
ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో హిట్ అండ్ రన్ ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వేగంగా వాహనాలు నడిపే నిర్లక్ష్య డ్రైవర్లు అమాయక ప్రాణాలను బలిగొంటున్నారు. రహదారి భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ హిట్ అండ్ రన్ ఘటన మరో కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. నవీన్ చారి కుటుంబానికి జరిగిన ఈ అన్యాయం బాధను మాటల్లో వ్యక్తం చేయలేం. ఈ ఘటనకు బాధ్యులైన వారిని పోలీసులు త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని జనాలు కోరుతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Industrial Diesel Price Hike: పెట్రోల్ తర్వాత షాకిచ్చిన డీజిల్.. పారిశ్రామిక డీజిల్ ధర లీటరుకు రూ. 22 పెంపు

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా...

Redmi 15A 5G: 6300mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరాలతో.. రెడ్‌మీ 15A 5G రిలీజ్ డేట్ ఫిక్స్

షియోమీ సబ్-బ్రాండ్ అయిన రెడ్‌మీ, రెడ్‌మీ 15 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను...

S.S.Thaman: త్రివిక్రమ్ నా గురువు.. వచ్చే సినిమాతో ఆస్కారే లక్ష్యం!

S.S.Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ తన కెరీర్‌లో ఎందరో దర్శకులతో...

Dhurandhar 2: ధురందర్ 2 లో ఊహించని క్లైమాక్స్‌.. పార్ట్ 3 ఉంటుందా?

Dhurandhar 2: రణవీర్ సింగ్ నటించిన మోస్ట్ ఏవైటెడ్ సీక్వెల్ ‘ధురందర్:...