హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వరుణుడు దంచికొట్టాడు. బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్.. సచివాలయం.. ఆబిడ్స్.. నాంపల్లి ..పటాన్ చెరువు, శేర్లింగంపల్లి ..సికింద్రాబాద్‌లలో భారీ వర్షం కురిసింది. భారీగా కురిసిన వానతో రోడ్లన్నీ కాలువలను తలపించాయి. లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్ల మీద నీరు నిలిచిపోయింది. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Also Read:Kakani Govardhan Reddy: హైకోర్టులో మాజీ మంత్రి కాకాణికి ఎదురుదెబ్బ..
సాయంత్రం వేళ కావడంతో ఆఫీసుపనులు, ఇతర పనులు చేసుకునే వారు ఇళ్లకు వెళ్లేందుకు తమ వాహనాలతో ఒక్కసారిగా రోడ్లమీదకి వచ్చారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు రూట్లలో వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, 12 లో బంపర్ టు బంపర్ జామ్ అయ్యింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి GVK, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు.