Honda Hness CB350: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా తన ప్రసిద్ధ మోడల్ Hness CB350 యొక్క 2025 వెర్షన్‌ను భారతదేశ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ మూడింటి వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. DLX, DLX Pro, DLX Pro Chrome వేరియంట్‌లలో లభిస్తుంది. తాజా మోడల్‌లో పొందుపరిచిన ఆధునిక ఫీచర్లు, పర్యావరణ అనుకూలతతో ఇది మోటార్‌సైకిల్ ప్రియులను ఆకర్షించేలా ఉంది. ఈ కొత్త హ్నెస్ CB350 ప్రధాన ప్రత్యేకత దాని ఇంజిన్‌లో చేసిన మార్పులు. ఇది ఇప్పుడు BS6, OBD-2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. అదనంగా, ఈ బైక్ E20 ఇంధన మిశ్రమానికి అనుకూలంగా ఉంటుంది. ఇది బయోఫ్యూయల్‌ను వినియోగించేందుకు వీలుగా ఉండి, పర్యావరణ పరిరక్షణలో ఒక మెరుగైన చర్యగా నిలుస్తుంది.
Read Also: Health Tips: బెల్లాన్ని ఆహారంలో చేర్చుకుంటే.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
ఇంజిన్ పరంగా చూస్తే.. ఇది ముందు మోడల్ లాగే 348.36cc ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 20.78 bhp పవర్, 30 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ వంటి లక్షణాలతో ఇది డ్రైవింగ్ అనుభూతిని మెరుగుపరుస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 2.10 లక్షల నుండి రూ. 2.15 లక్షల వరకు ఉన్నాయి. ఈ కొత్త మోడల్‌లో బాడీ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా, కొత్త రంగుల ఎంపికలు మోటార్‌సైకిల్‌కు కొత్త హంగును తీసుకువచ్చాయి.
పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే రంగులలో ఇవి అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో DLX Pro వేరియంట్‌కు రెబెల్ రెడ్ మెటాలిక్, DLX Pro Chrome వేరియంట్‌కు అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ అనే ప్రత్యేక షేడ్స్ ఉన్నాయి. ఇక ఇందులో ఆధునిక ఫీచర్ల విషయానికి వస్తే.. భద్రతతో కూడిన స్మార్ట్ రైడింగ్ అనుభవం లభిస్తుంది. హోండా Hness CB350 పవర్‌ఫుల్ లుక్ తో పాటు, ఆధునిక టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు కూడా కలిగి ఉంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెన్స్‌తో కూడిన సెమీ-డిజిటల్ కన్సోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, డ్యూయల్ ఛానల్ ABS వంటి అంశాలు ఉన్నాయి. ఇవి ప్రయాణ సమయంలో రైడర్‌కు నిరోధకత, స్థిరత్వం, భద్రతను కల్పిస్తాయి.