17
August, 2026

A News 365Times Venture

17
Monday
August, 2026

A News 365Times Venture

Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!

Date:

Homemade Ghee: మార్కెట్‌లో లభించే నెయ్యితో పోలిస్తే ఇంట్లోనే స్వచ్ఛమైన పాలమీగడతో తయారు చేసుకునే నెయ్యి ఎంతో రుచిగా, సువాసనభరితంగా ఉంటుంది. అంతేకాదు.. నెయ్యి తయారీలో ఉపయోగించే పదార్థాలు మనకు తెలిసినవే కాబట్టి నాణ్యత విషయంలోనూ ఒక భరోసా ఉంటుంది. అయితే ఇంట్లో నెయ్యి తయారు చేయాలంటే చాలా సమయం పడుతుందని, చేతులకు వెన్న అంటుకుని ఇబ్బందిగా ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా నెయ్యిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఆ విధానం ఏంటో చూద్దామా..

కావలసిన పదార్థాలు:

* ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పాలమీగడ
* చల్లటి నీరు లేదా ఐస్ ముక్కలు
* అర టీస్పూన్ మెంతులు లేదా ఒక తమలపాకు

తయారీ విధానం:

రోజూ పాలను కాచి చల్లార్చిన తర్వాత పైకి వచ్చే మీగడను తీసి ఒక శుభ్రమైన డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. కొన్ని రోజుల పాటు ఇలా సేకరించిన మీగడతో ఒకేసారి నెయ్యి తయారు చేసుకోవచ్చు. నెయ్యి తయారు చేసే ముందు మీగడను ఫ్రిజ్‌ నుంచి బయటకు తీసి కాసేపు ఉంచాలి. పూర్తిగా గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత వెన్న వేరు చేయడం సులభంగా ఉంటుంది.

గది ఉష్ణోగ్రతకు వచ్చిన మీగడను మిక్సీ జార్‌లో లేదా వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. వాతావరణం వేడిగా ఉంటే చల్లటి నీటిని, చలికాలంలో అయితే సాధారణ నీటిని కొద్దిగా కలపాలి. మీగడను ఒకే దిశలో చిలకడం లేదా మిక్సీలో కొద్దిసేపు తిప్పడం చేయాలి. ఇలా చేస్తే కొద్దిసేపటికే వెన్న ముద్దలా పైకి తేలుతుంది. దీంతో చేతులతో ఎక్కువగా కలపాల్సిన అవసరం ఉండదు. వేరైన వెన్నను శుభ్రమైన నీటితో ఒకటికి రెండుసార్లు కడగాలి. ఇలా చేయడం వల్ల వెన్నలో మిగిలి ఉండే మజ్జిగ తొలగిపోయి నెయ్యికి మంచి రుచి, వాసన వస్తాయి.

ఇప్పుడు శుభ్రంగా కడిగిన వెన్నను మందపాటి అడుగు ఉన్న పాత్రలో వేసి స్టవ్‌పై పెట్టాలి. మధ్యస్థ మంటపై వెన్నను నెమ్మదిగా కరిగించాలి. వెన్న పూర్తిగా కరిగిన తర్వాత నురుగు వస్తూ మరుగుతుంది. అడుగు పట్టకుండా అప్పుడప్పుడు గరిటెతో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. వెన్నలోని నీటి శాతం తగ్గుతూ క్రమంగా నెయ్యి స్పష్టంగా మారుతుంది. నెయ్యి బంగారు రంగులోకి మారి మంచి సువాసన రావడం ప్రారంభమైనప్పుడు మంటను తగ్గించాలి. అనంతరం కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.

నెయ్యి కొద్దిగా చల్లారిన తర్వాత, ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడే స్టీల్ జల్లెడ లేదా పలుచని వడతో వడకట్టుకోవాలి. వాటితో వడకట్టి శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న గాజు సీసా లేదా స్టీల్ డబ్బాలోకి నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి పూర్తిగా చల్లారిన తర్వాత మంచి రంగుతో, చక్కటి సువాసనతో గట్టిపడుతుంది. వాడేటప్పుడు ఎల్లప్పుడూ పొడిగా ఉన్న స్పూన్‌ను మాత్రమే ఉపయోగించాలి.

నెయ్యి నిల్వ చేసే సీసా లేదా డబ్బాలో తేమ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. తడి స్పూన్లు లేదా తడి చేతులతో నెయ్యిని తీయకూడదు. పొడిగా, శుభ్రంగా ఉండే గాలి చొరబడని డబ్బాలో భద్రపరిస్తే నెయ్యి ఎక్కువకాలం నాణ్యతను కాపాడుకుంటుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు

FDA Notice: పాన్ మసాలా బ్రాండ్‌ను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో...

PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్‌పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..

Vajpayee Death Anniversary: భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన అజాతశత్రువు,...

Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్!

పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (28) హత్య కేసు దర్యాప్తు...

Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఐతంపూడి...