17
March, 2026

A News 365Times Venture

17
Tuesday
March, 2026

A News 365Times Venture

Haryana Shocker: లవర్‌కు రంగులు రాశాడని, ఫ్రెండ్ దారుణహత్య..

Date:

Haryana Shocker: తన ప్రేయసికి రంగులు పూశాడనే కారణంగా ఒక వ్యక్తి 23 ఏళ్ల యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హర్యానాలోజరిగింది. హత్యను రైలు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు యువకుడి మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశారని పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలోని పానిపట్‌లో ఈ ఘటన జరిగింది.

హోలీ పండగ రోజున కాలు అనే వ్యక్తి అదృశ్యమ్యాడు. ఆ తర్వాత అతడి మృతదేహం రైల్వే ట్రాక్‌పై దొరికింది. మొదట్లో దీనిని రైలు ప్రమాదంగా అంతా భావించారు. అయితే, , ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) జరిపిన దర్యాప్తులో ఇది ముందుగానే పథకం ప్రకారం చేసిన అత్యంత కిరాతకమైన హత్య అని తేలింది. ఈ కేసులో మహమూద్‌పూర్‌కు చెందిన సంజు, రాహుల్, విశాల్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Read Also: Pak-Afghan war: 400 మంది మృతి.. పాకిస్తాన్‌పై అఫ్ఘాన్ క్రికెటర్ల ఆగ్రహం..

పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. హోలీ రంగుల వివాదం, గతంలో ఉన్న వ్యక్తిగత కక్షల కారణంగా హత్య జరిగినట్లు తెలిసింది. విచారణలో ముగ్గురు నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ కుట్ర వెనక ప్రధాన సూత్రధారి సంజు అని పోలీసులు గుర్తించారు. హోలీ రోజున సంజు ప్రేయసికి కాలు రంగులు పూయడంతో గొడవ ప్రారంభమైంది. దీని తర్వాత హత్యకు సంజు ప్లాన్ చేసినట్లు తేలింది. ఘటన రోజున కాలును సంజు బయటకు రావాలని కోరాడు. ముగ్గురు నిందితులతో కలిసి కాలు మద్యం సేవించాడు. కాలుతో ఎక్కువ మందు తాగించారు.

కాలు మద్యం మత్తులో ఉన్నప్పుడు ,అతడిని బైక్‌పై రైల్వే ట్రాక్‌ వద్దకు తీసుకెళ్లారు. అక్కడే సంజు స్క్రూడ్రైవర్‌తో అతని మెడపై రెండుసార్లు దాడి చేశాడు. అయినప్పటికీ, ఈ దాడి జరిగినప్పటికీ కాలు మరణించలేదు. ఆ తర్వాత కాలు కాళ్లు చేతులు కట్టేసి, రైల్వే ట్రాక్‌పై పడుకోబెట్టారు. మద్యం మత్తు, గాయాల వల్ల కాలు కదలలేకపోయాడు. నిందితులు అక్కడి నుంచి వెళ్లిన వెంటనే వేగంగా వస్తున్న రైలు అతడిని ఢీకొట్టింది. సాంకేతిక ఆధారాలు, మొబైల్ లొకేషన్ డేటా ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Tragedy : ప్రేమ పెళ్లి.. చివరికి హత్య..! విషాదంతంగా యుట్యూబర్ వైష్ణవి లైఫ్..

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి...

KTR : 27 నెలలు అయిన PRC పత్తా లేదు.. ఇంకా 5 DAలు బాకీ..

KTR : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ...

YS Jagan: పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టానే.. సీఎం నో యాక్షన్‌!

పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టా మహేషే అని...

Kukatpally Robbery: కూకట్‌పల్లిలో సినీ స్టైల్ దోపిడీ.. కారంపొడి చల్లి కోటి రూపాయలు దోచుకెళ్లిన దుండగులు!

Kukatpally 1 Crore Robbery: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో భారీ దోపిడీ...