Harry Brook: పాకిస్థాన్ వేదికగా రావల్పిండిలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 429 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ కెప్టెన్ హరీ బ్రూక్ అద్భుతమైన డబుల్ సెంచరీతో సిలంక బౌలర్లను ఆ ఆట ఆదుకున్నాడు. కేవలం 116 బంతుల్లోనే 21 ఫోర్లు, 10 సిక్సర్స్ సహాయంతో 174.13 స్ట్రైక్‌రేట్‌తో 202 పరుగులు చేసి చివరి బంతికి ఔటయ్యాడు. దీనితో బ్రూక్ వన్డేలలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. మొదటి వంద పరుగులు చేయడానికి 75 బంతులు పట్టగా.. డబుల్ సెంచరీ సెంచరీని అందుకోవడానికి మరో 36 బంతులు మాత్రమే తీసుకున్నాడు.
అలాగే మ్యాచ్ లో బ్రూక్‌కు తోడుగా విల్ జాక్స్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 30 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు జో రూట్ 66 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఓపెనర్లు టామ్ బాంటన్ 51 బంతుల్లో 50, బెన్ డకెట్ 39 బంతుల్లో 29 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లాలాగే 2 వికెట్లు తీయగా.. అసిత ఫెర్నాండో, జనిత్ లియానాగే చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 78 పరుగులు రాబట్టింది. దీంతో 50 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 429/4 పరుగులు చేసింది. ఫలితంగా శ్రీలంక విజయానికి 430 పరుగుల భారీ లక్ష్యం ముందుంది.
Harry Brook 101*(75) to 202*(116)
4, 1, 0, 1, 1, 4, 0, 2, 6, 4, 4, 1, 0, 6, 1, 1, 0, 4, 0, 4, 1,4, 6, 1, 4, 1, 4,1, 4, 4, 6, 0, 2, 1, 6, 2, 2, 4, 2.
101 Runs in just 41 Runs
21 Fours & 10 Sixes.
Fastest double hundred.
https://t.co/6ouDl8nuj1— VIKAS (@Vikas662005) October 22, 2026



Harry Brook 101*(75) to 202*(116) 
21 Fours & 10 Sixes. 
