16
March, 2026

A News 365Times Venture

16
Monday
March, 2026

A News 365Times Venture

Harish Rao: టన్నెల్‌లో 8 మంది చిక్కుకొని ఉంటే.. సీఎం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు!

Date:

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది చిక్కుకొని ఉంటే.. ప్రభుత్వ హెలికాప్టర్‌లో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే నానా హంగామా చేశారని, కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో మూడు ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని ప్రకృతి వైపరీత్యం అంటున్న ప్రభుత్వం.. కాలేశ్వరం ప్రమాదాన్ని అప్పటి ప్రభుత్వ వైఫల్యం అనడం విడ్డురంగా ఉందని హరీశ్‌ రావు పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవడం వలనే ప్రమాదం జరిగింది. మేము ప్రాజెక్టును ఆలస్యం చేశామనేది శుద్ధ తప్పు. మేము ఎస్‌ఎల్‌బీసీ కోసం అసెంబ్లీలో చర్చ పెట్టి అఖిలపక్షం ఏర్పాటు చేశాము. ఇది పూర్తి చేయడానికి వేల కోట్లు ఖర్చు పెట్టాము. ఎస్‌ఎల్‌బీసీ ప్రపంచంలోనే క్రిటికల్, సెన్సిటివ్ ప్రాజెక్ట్. ఇంత పెద్ద ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకొని ఉంటే.. ప్రభుత్వ హెలికాప్టర్‌లో వెళ్లి సీఎం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు.

‘కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్టులో అనుమతిస్తే ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని ప్రకృతి వైపరీత్యం అంటున్న ప్రభుత్వం.. కాలేశ్వరం ప్రమాదాన్ని అప్పటి ప్రభుత్వ వైఫల్యం అంటుంది. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే నానా హంగామా చేశారు. కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో మూడు ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయి. ఎస్‌ఎల్‌బీసీ లాంటి ప్రమాదమే కాళేశ్వరంలో కూడా జరిగింది కానీ.. మేము ఎంతో జాగ్రత్తగా దానిని రెక్టీఫై చేశాము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ముందుకు వెళ్లడం అనుమానమే. కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకొని అయినా ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడాలి. 8 మంది ప్రాణాలతో బయటకు రావాలని కోరుకుంటున్నాం’ అని హరీశ్‌ రావు చెప్పుకొచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Transgender Rights Law : ట్రాన్స్ జెండర్స్ హక్కులపై చెలరేగుతున్న దుమారం..

Transgender Rights Law : భారతదేశంలో ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ కోసం...

Shahid Afridi: పాక్ క్రికెట్‌లో సంక్షోభం.. అల్లుడిని టార్గెట్ చేసిన షాహీద్ అఫ్రిది..

Shahid Afridi: ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో ఘోర పరాజయాలు మరవకముందే,...

Stock Market Rise: స్టాక్ మార్కెట్ ఈ రోజు సడన్‌గా పెరగడానికి కారణం ఏంటి..? ఏం జరిగిందంటే..

ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈరోజు (మార్చి 16) భారీ లాభాలతో ముగిసింది....

Stock Market: పండిన ఇన్వెస్టర్ల పంట.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

హమ్మయ్య.. చాలా రోజుల తర్వాత నష్టాలకు బ్రేక్ పడ్డాయి. దేశీయ మార్కెట్‌లో...