Harish Rao: వరంగల్ జిల్లా చేరుకున్న మాజీమంత్రి హరీష్ రావు కి బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభా ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు. సభకు వచ్చే కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఇక, హరీష్ రావు మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో అతి పెద్ద సభకు వేదిక నిలిచింది.. ఇప్పటికి సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఇప్పటికే జనం సభకి తరలి వస్తున్నారు.. బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ లేదు.. తెలంగాణ లేకపోతే ఇంత అభివృద్ధి ఉండేది కాదు.. తెలంగాణ ప్రజల పక్షంలోనే బీఆర్ఎస్ ఉంటుంది అని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: Thudarum Movie Review: తుడరుమ్ రివ్యూ
ఇక, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక్క పథకం ఇవ్వడం లేదని హరీష్ రావు ఆరోపించారు. వాళ్ళు చెప్పిన పథకాలు ఇవ్వకపోయినా.. గతంలో ఉన్న పథకాలు అమలు చేయడం లేదన్నారు. శృతి లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆదాయం తగ్గిపోయింది.. పాలన చేతకాక రేవంత్ మాట తప్పిండు.. రుణామాఫీ చేస్తానని మోసం చేసిండు.. అసెంబ్లీలో తప్పుడు ప్రకటన చేసి.. రైతులను మోసం చేశారు.. రైతుల కోసం పని చేసింది కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే.. కాంగ్రెస్ మోసం చేసిన తీరుకు ఈ సభకు అన్ని వర్గాల వాళ్ళు వస్తున్నారు.. కాంగ్రెస్ కు పరిపాలన చేతకాక పంటలను ఎండ బెట్టైంది అని హరీష్ రావు మండిపడ్డారు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌ని ఎగతాళి చేస్తున్న సొంత ప్రజలు.. కామెంట్స్ చూస్తే నవ్వాపుకోలేరు..
అయితే, నీళ్లు లేక కాదు పాలన చేతకాక పంటలను ఎండ బెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నీళ్లు ఉన్న పంటలు ఎండిపోయాయంటే.. ఇది చేత కానీ ప్రభుత్వం.. దద్దమ్మ ప్రభుత్వం అంటూ తీవ్రంగా మండిపడ్డాడు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మోటర్లు అన్ చేయకపోవడంతో రాష్ట్రంలో పంటలు ఎండిపోయాయి.. జనం స్వచ్ఛందంగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక, కేసీఆర్ సభ పైనా ప్రజల కంటే కాంగ్రెస్ నాయకులకే ఇంట్రెస్ట్ పెరిగింది అని సెటైర్ వేశారు. కేసీఆర్ ఏం మాట్లాడుతారు అని కాంగ్రెస్ నేతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని హరీష్ రావు తెలిపారు.