25
May, 2026

A News 365Times Venture

25
Monday
May, 2026

A News 365Times Venture

Hardik Pandya: MI వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. 07:07 టైమ్‌పై సోషల్ మీడియాలో చర్చ..

Date:

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో చేసిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. లీగ్ స్టేజ్ ముగిసేసరికి ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్‌గా.. ఆటగాడిగా హార్దిక్ పాండ్యా తీవ్రంగా నిరాశపరిచారు. ఈ నేపథ్యంలో ముంబయి యాజమాన్యం ఆయనపై వేటు వేయనుందనే ప్రచారం జరుగుతుండగా.. హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక ‘క్రిప్టిక్’ పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చింది.

ఆ ’07:07′ సమయం వెనుక మర్మమేంటి?
హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను పంచుకున్నారు. అందులో ఆయన లాప్‌టాప్ చూస్తూ ఉండగా, పక్కనే ఉన్న మొబైల్ స్క్రీన్ వెలుగుతూ కనిపించింది. అయితే, ఆ మొబైల్ లాక్ స్క్రీన్‌పై సమయం కచ్చితంగా “07:07” అని చూపిస్తోంది. దీనిని గమనించిన నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని భావిస్తున్నారు. క్రికెట్‌లో ‘7’ నంబర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం ఎంఎస్ ధోనీ. దీంతో హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ను వీడి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరబోతున్నారనే సరికొత్త చర్చకు సామాజిక మాధ్యమాల్లో తెరలేచింది.

మరో ఆసక్తికర కోణం: రెండో పెళ్లా?
ఈ పోస్ట్‌పై కేవలం ఐపీఎల్ మార్పుల గురించే కాకుండా, హార్దిక్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో ప్రచారం కూడా సాగుతోంది. ఆ ఫోటోలో ఉన్న నోట్‌బుక్, పెన్ పింక్ కలర్‌లో ఉండటం, అలాగే ‘07:07’ సమయం ఉండటాన్ని బట్టి ఆయన రాబోయే జూలై 7వ తేదీన (7వ నెల, 7వ తేదీ) ప్రముఖ మోడల్ మహీకా శర్మను రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

ముంబయి కోచ్ కీరన్ పొలార్డ్ సైతం హార్దిక్ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో, ఈ ’07:07′ పోస్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ రికార్డు నాకు లెక్క కాదు.. టీ20ల్లో 200 కొట్టి చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ

క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించడం ఒక ఎత్తైతే, వాటిని తిరగరాయడం మరో...

Nara Lokesh: మహానాడుపై క్లస్టర్‌ ఇంఛార్జ్‌లకు నారా లోకేష్ దిశానిర్దేశం

Nara Lokesh: క్లస్టర్ స్థాయిలో మహానాడు విజయవంతానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని...