హమాస్ అగ్ర నేతలు పాకిస్థాన్‌లో తిష్ట వేసినట్లుగా తెలుస్తోంది. లష్కరే తోయిబాతో కలిసి హమాస్ కలిసి పని చేస్తు్న్నట్లుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ కూడా ధృవీకరించారు.
ఇటీవల కాలంలో హమాస్ నాయకులు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ప్రాంతాన్ని సందర్శించినట్లుగా రూవెన్ పేర్కొన్నారు. అక్కడ జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశం అయినట్లుగా తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిపినట్లుగానే.. పహల్గామ్‌పై కూడా అదే మాదిరిగా ఉగ్రదాడి జరిగిందని.. రెండింటికీ పెద్ద తేడా లేదని రూవెన్ అజార్ పేర్కొన్నారు. ఒక ప్రణాళిక ప్రకారమే పహల్గామ్ ఉగ్రదాడి జరిగినట్లుగా వెల్లడించారు. అక్టోబర్ 7, 2023న కూడా హమాస్ పౌరులనే లక్ష్యంగా చేసుకున్నారని.. ఇప్పుడు పహల్గామ్‌లో కూడా పౌరులనే టార్గెట్ చేసుకున్నారని.. ఇదంతా హమాస్ సాహకారంతోనే పహల్గామ్ ఘటన జరిగినట్లు వివరించారు. అప్పుడు ఇజ్రాయెల్ పౌరులు సంగీత కార్యక్రమంలో ఉండగా దాడి చేశారని.. ఇప్పుడు పహల్గామ్‌లో కూడా పౌరులు సరదాగా గడుపుతున్న సమయంలో ఎటాక్ చేశారని గుర్తుచేశారు. హమాస్-లష్కరే తోయిబా సమన్వయంతోనే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని స్పష్టం చేశారు.
భారత్‌ను ఒక లక్ష్యంతో దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతోనే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. కుట్రలో భాగంగానే ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్.. కాశ్మీర్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. విదేశాల్లో ఉన్న పాక్ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ కాశ్మీర్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. కాశ్మీర్ మన ఊపిరి, మన జీవనాడి.. దాన్ని ఎలా మరిచిపోతాం అంటూ ఉద్వేగ ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం తర్వాతే ఈ పహల్గామ్ ఘటన చోటుచేసుకుంది. ఇదంతా చూస్తుంటే.. కచ్చితంగా ఒక పక్కా స్కెచ్‌తో భారత్‌పై ఉగ్రదాడి జరిగినట్లుగా అర్థమవుతోంది.