GVMC Deputy Mayor: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక పూర్తి అయినా.. డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో కూటమి పార్టీలు సుదీర్ఘ కసరత్తు చేయాల్సి వచ్చింది.. అయితే, మేయర్ టీడీపీకి, డిప్యూటీ మేయర్ జనసేనకు అనే ఓ ప్రచారం జరిగినా.. రెండు పోస్టుల కోసం టీడీపీ నేతలు పట్టుబడుతూ వచ్చారు.. అయితే, ఎట్టకేలకు GVMC డిప్యూటీ మేయర్ పదవిని పోరాడి సాధించింది జనసేన పార్టీ.. గంగవరం కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరును డిప్యూటీ మేయర్‌గా ఖరారు చేసింది జనసేన అధిష్టానం.. అయితే, జనసేన డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నా.. ఇప్పుడు కూటమిలో కొత్త వివాదం మొదలైంది..
Read Also: Congress vs BJP: రైల్వే టికెట్లపై ఆపరేషన్ సింధూర్ ప్రచారం.. బీజేపీపై కాంగ్రెస్ ఆగ్రహం..
జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయింపుపై టీడీపీ ఆశావహులు గుస్సు మంటున్నారు.. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో ఈ పరిస్థితిపై హాట్ హాట్ డిస్కషన్ జరిగిందట.. తమను మభ్యపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారట టీడీపీ ఆశావహులు.. మరోవైపు.. కూటమిలో డిప్యూటీ మేయర్ ఎంపిక పై కొత్త వివాదం మొదలైనట్టుగానే తెలుస్తోంది.. సమన్వయ సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు రెండు సామాజికవర్గాలకు చెందిన అసంతృప్త కార్పొరేటర్లు… అంతేకాదు, బీచ్ రోడ్ లోని ఒక హోటల్ లో సమావేశం అయ్యారట.. డిప్యూటీ మేయర్ ఎన్నిక కు హాజరవ్వడంపై తర్జనభర్జన పడుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే కార్పొరేషన్ కు ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ చేరుకున్నారు.. మరి కూటమి కార్పొరేటర్లు హాజరు అవుతారా? డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి? అనేది ఇప్పుడు కూటమి పాలిటిక్స్‌ను కాకరేపుతోంది.