ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-35లో గుజరాత్ టైటాన్స్ (GT) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఎనిమిది వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ను కైవసం చేసుకోవాలంటే గుజరాత్ 204 పరుగులు సాధించాల్సి ఉంటుంది. బ్యాటర్లు సమష్టిగా రాణించారు. కాగా.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ అక్షర్ పటేల్(39) రాణించాడు. వరుస వికెట్లు పడుతుండటంతో అశుతోష్ శర్మ నిలకడగా ఆడాడు.
READ MORE: Sumaya Reddy: ‘డియర్ ఉమ’ విజయాన్ని మహిళలందరికీ అంకితం చేస్తున్నా!
టీం మంచి స్కోరు సాధించేందుకు యత్నించాడు. 37 పరుగులు చేసిన చివరి ఓవర్‌లో ఔట్ అయ్యాడు. కరుణ్ నాయర్(31), ట్రిస్టన్ స్టబ్స్(31), కెఎల్ రాహుల్(28) సైతం టీంకి చేయూతనందించారు. అభిషేక్ పోరెల్(18) పర్వాలేదనిపించాడు. మరోవైపు.. బౌలింగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటెల్ లాంటి కీలక ఆటగాళ్లను తన బౌలింగ్‌లో ఔట్ చేశాడు. అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.
READ MORE: Resonance : జేఈఈ మెయిన్‌లో ‘రెసోనెన్స్’ విజయ దుందుభి
ఢిల్లీ క్యాపిటల్స్ కు మంచి ఆరంభం లభించలేదు. రెండో ఓవర్లోనే అభిషేక్ పోరెల్ వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన పోరెల్ ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ ఓవర్‌లో ఔటయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన యార్కర్‌తో రాహుల్‌ను ఎల్‌బిడబ్ల్యుగా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ తో 28 పరుగులు చేశాడు. కరుణ్ 18 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 31 పరుగులు చేసి ప్రసిద్ధ కృష్ణ చేతిలో ఔట్ అయ్యాడు. అనంతరం కెప్టెన్ అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ నాల్గవ వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మహ్మద్ సిరాజ్ ఓవర్‌లో ట్రిస్టన్ స్టబ్స్(31) పెవిలియన్‌కు చేరాడు. 18వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ముందుగా అక్షర్ పటేల్(39)ను పెవిలియన్‌కు పంపాడు. క్రీజ్‌లోకి వచ్చిన విప్రజ్ నిగమ్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత ‘ఇంపాక్ట్ సబ్’గా వచ్చిన డోనోవన్ ఫెరీరా(1)ను ఇషాంత్ శర్మ మళ్లీ పెవిలియన్‌కు పంపాడు. నిలకడగా ఆడిన అశుతోష్ శర్మ(37) వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్(4), మిచెల్ స్టార్క్(2) నాటౌట్‌గా నిలిచారు.