అజిత్ హీరోగా, ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాకపోయినా, తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ కావడంతో వారు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. తాజాగా, ఈ సినిమా సక్సెస్ మీట్‌ను ఈ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇక ఇప్పుడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థాంక్స్ గివింగ్ మీట్‌ను చెన్నైలో నిర్వహిస్తున్నారు.
Bomb Threat: ద్వారకా కోర్టుకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలెర్ట్
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో ఆధిక్ రవిచంద్రన్ కోసం ఆయన తండ్రి రవిచంద్రన్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన తమిళ మీడియా వర్గాలు రవిచంద్రన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఇది మొదటిసారి మాత్రం కాదు ఎందుకంటే ఆధిక్ మొదటి సినిమా నుంచి ఇలానే రవిచంద్రన్ ఆయన సినిమాలకు పని చేస్తున్నాడు. తనయుడు డైరెక్ట్ చేసిన సినిమాకి తండ్రి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేయడం ఒక అరుదైన ఘట్టమని, పోర్టల్స్‌లో కథనాల వర్షం కురిపిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సంగతి తెలిసిందే. తమిళ ప్రేక్షకులను టార్గెట్ చేసి రూపొందించిన ఈ సినిమా వారికి బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది.