19
February, 2026

A News 365Times Venture

19
Thursday
February, 2026

A News 365Times Venture

God vs Job Deal: దేవుడితో 20 లక్షల ప్యాకేజీ ఒప్పందం.. హుండీలో విద్యార్థి లేఖ వైరల్..

Date:

God vs Job Deal: సాధారణంగా భక్తులు దేవుడిని కష్టాలు తీర్చమని వేడుకుంటారు. సమస్యల నుంచి బయటపడితే తలనీలాలు సమర్పిస్తామని, కానుకలు ఇస్తామని మొక్కుకోవడం హైందవ సంప్రదాయం. అయితే, ఏలూరు జిల్లాలో ఓ భక్తుడు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, “నాకు ఇది చేస్తే.. నేను నీకు అది చేస్తాను” అంటూ ఏకంగా భగవంతుడితో ముందస్తు ఒప్పందం (Agreement) కుదుర్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలోని శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల అనంతరం హుండీ లెక్కింపు చేపట్టగా, అందులో ఓ విద్యార్థి రాసిన వింత లేఖ వెలుగుచూసింది.

Pakistan Cricket: బాబర్‌ను తీసేయాలని చెప్తే, నన్నే తీసేశారు.. పాక్ మాజీ సంచలన వ్యాఖ్యలు..

ఆ లేఖలో సదరు విద్యార్థి తన కోరికలను అత్యంత స్పష్టంగా, ఒక అగ్రిమెంట్‌ తరహాలో పేర్కొన్నాడు. తనకు ఏడాదికి రూ. 20 లక్షల ప్యాకేజీతో కూడిన ఉద్యోగం రావాలని, అలాగే ఇటీవల జరిగిన పరీక్షల్లో 9 CGPA (సుమారు 85%-86%) మార్కులు సాధించాలని స్వామివారిని కోరుకున్నాడు. ఇక్కడి వరకు అంతా సాఫీగా ఉన్నా, ఆ లేఖలో ఆయన పెట్టిన కండిషన్ చూసి అధికారులు విస్తుపోయారు. ఈ కోరికలు నెరవేరితేనే తాను స్వామివారికి అభిషేకం చేసి, నూతన వస్త్రాలు సమర్పిస్తానని ఆ తెల్ల కాగితంపై రాసి హుండీలో వేశాడు. అంటే, తన పని జరిగితేనే దేవుడికి మొక్కు చెల్లిస్తానని ఒక రకమైన ‘ఆఫర్’ ప్రకటించాడన్నమాట.

ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భక్తులు తమ మనసులోని కోరికలను దేవుడికి చెప్పుకోవడం సహజమే అయినా, ఇలా రాతపూర్వకమైన ఒప్పందం చేసుకోవడం వింతగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైందవ సంప్రదాయంలో కొబ్బరికాయ కొట్టడం నుంచి తలనీలాలు సమర్పించడం వరకు ప్రతి దాని వెనుక ఒక లోతైన అర్థం ఉంటుంది. కానీ ఇప్పటి ‘జెన్-జీ’ (Gen Z) తరానికి భక్తి కూడా ఒక కోడింగ్‌లా, ‘గివ్ అండ్ టేక్’ పాలసీలా మారిపోయిందని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. తన భవిష్యత్తుపై ఉన్న గట్టి ఆశనో లేక అమాయకత్వమో కానీ, ఆ విద్యార్థి రాసిన ఈ ప్యాకేజీ లెటర్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచింది.

YS Jagan: దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్లు ఉంది వీళ్ల వ్యవహారం..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Jowar Idli Recipe: వెయిట్ లాస్ కోసం హెల్తీ, టేస్టీ బ్రేక్‌ఫాస్ట్.. ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్ జొన్న ఇడ్లీలు..

Jowar Idli Recipe: ప్రస్తుతం వయసుకు సంబంధం లేకుండా బరువు పెరుగుతున్నారు....

Vijayawada: షాకింగ్.. విజయవాడ లో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కలకలం..

Vijayawada: విజయవాడ భవానీపురంలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఈ...

Amazon Deal: అమెజాన్ లో హాట్ డీల్.. Haier 190L ఫ్రిజ్ పై 31% డిస్కౌంట్..

Haier fridge offer : పెరుగుతున్న ఎండల దృష్ట్యా రిఫ్రిజిరేటర్ల అవసరం...