అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన గ్లెన్ ఫిలిప్స్, భారత బౌలింగ్ విభాగాన్ని, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. బుమ్రాను ఒక ‘ప్రపంచ స్థాయి ఆపరేటర్’గా అభివర్ణించిన ఫిలిప్స్, అతని వద్ద ఉన్న వైవిధ్యమైన బంతులు, ముఖ్యంగా డెత్ ఓవర్లలో అత్యంత ఖచ్చితత్వంతో వేసే యార్కర్లు ఏ బ్యాటర్ కైనా సవాలేనని అంగీకరించారు. అయితే, బుమ్రా అజేయుడేమీ కాదని, మిగిలిన ఆటగాళ్లలాగే అతను కూడా మనిషేనని, అతనికీ ఏదో ఒక రోజు తడబడే అవకాశం ఉంటుందని ఫిలిప్స్ వ్యాఖ్యానించారు.
Pakistan: “ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ పాకిస్తాన్”.. ఇరాన్ యుద్ధంపై పాక్ నాయకుల భయం..
“బుమ్రా అత్యుత్తమ బౌలర్ అనడంలో సందేహం లేదు, కానీ అతను కూడా మనిషే. అందరిలాగే అతనికి కూడా ‘బ్యాడ్ డే’ ఉండొచ్చు. ఆ రోజు (ఫైనల్ మ్యాచ్) అతనికి అలాంటి రోజే కావాలని మేము కోరుకుంటున్నాము” అని ఫిలిప్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో బుమ్రా 18వ ఓవర్ వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్ విజయానికి బాటలు వేసిన తీరును ఆయన గుర్తు చేశారు.
బుమ్రా వేసే 4 ఓవర్లను కేవలం డిఫెన్స్ ఆడుతూ వదిలేయలేమని, అతను పొరపాటున లూజ్ బాల్ వేస్తే దానిని బౌండరీకి తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కివీస్ వ్యూహాన్ని బయటపెట్టారు. ఒకవేళ బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో కట్టడి చేస్తే, దానికి తగ్గట్లుగా మైదానంలోనే తమ ప్రణాళికలను మార్చుకుంటామని ఫిలిప్స్ స్పష్టం చేశారు.
Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!
కేవలం బుమ్రా మాత్రమే కాకుండా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం కూడా తమకు కీలకమని ఫిలిప్స్ పేర్కొన్నారు. గత ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుణ్‌ను ఎదుర్కొన్న అనుభవం తమకు ఉందని, బంతిని బట్టి ఆడుతూ ఒత్తిడిని అధిగమిస్తామని చెప్పారు. లక్షలాది మంది భారత అభిమానుల మధ్య, డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌ను వారి సొంత గడ్డపై ఎదుర్కోవడం ‘డేవిడ్ vs గోలియత్’ పోరాటంలా ఉంటుందని, కానీ తమ జట్టుకు ఒత్తిడిని తట్టుకుని నిలబడటం తెలుసని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించిన జ్ఞాపకాలను కివీస్ జట్టు గుర్తు చేసుకుంటోంది. ఆదివారం జరగబోయే ఈ అమీతుమీ పోరులో బుమ్రా తన ప్రతాపం చూపిస్తాడా లేక ఫిలిప్స్ ఆశించినట్లుగా కివీస్ పైచేయి సాధిస్తుందా అన్నది వేచి చూడాలి.
Buying New AC Tips: ఎండలు మండిపోతున్నాయి.. ఏసీ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి..




