17
March, 2026

A News 365Times Venture

17
Tuesday
March, 2026

A News 365Times Venture

Giorgia Meloni: నేను, మోడీ, ట్రంప్ మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ముప్పా.? వామపక్షాలపై మెలోనీ తీవ్ర ఆగ్రహం..

Date:

Giorgia Meloni: ప్రపంచ వామపక్ష రాజకీయ నాయకులపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలాంటి నాయకులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ వంటి కొత్త ప్రపంచ సంప్రదాయవాద ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని, నాయకత్వం వహిస్తున్నారని ఆమె అన్నారు. ఈ జాతీయ నాయకులు జాతీయ ప్రయోజనాల గురించి, వారి దేశ సరిహద్దులను రక్షించుకోవడం గురించి మాట్లాడితే కొందరు దీనిని ప్రజాస్వామ్యానికి ముప్పుగా పిలుస్తున్నారని అన్నారు. జాతీయవాద నాయకులపై వామపక్ష నాయకులు తరుచుగా చేసే విమర్శలను ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మెలోని చెప్పారు.

Read Also: Teacher Harassment: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి..

జాతీయవాద నాయకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల్ని ఎదుర్కొంటున్నారని, దీంతో లెఫ్ట్ లిబరల్స్ ఆందోళన చెందుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ‘‘90లో బిల్ క్లింటన్(అమెరికా ప్రెసిడెంట్), టోనీ బ్లేయర్(యూకే పీఎం) ప్రపంచ వామపక్ష ఉదారవాద నెట్‌వర్క్‌ను సృష్టించినప్పుడు, వారిని రాజనీతిజ్ఞులు అని పిలిచేవారు. నేడు, ట్రంప్, మెలోని, మిలీ లేదా బహుశా మోడీ మాట్లాడినప్పుడు, వారిని ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇది వామపక్షాల ద్వంద్వ ప్రమాణాలు’’ అని ఆదివారం వాషింగ్టన్ డీసీలో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

యూరప్‌లోని ఇతర దేశాలతో పాటు ఇటలీలో అక్రమ వలసదారుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, మెలోనీ తరుచుగా తన ఆందోళనల్ని వ్యక్తం చేస్తోంది. ఈ వలసల ముప్పుని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వామపక్ష ఉదారవాదులు మోడీ, ట్రంప్ లాంటి నాయకులపై ఎంత బురద జల్లినా కూడా ప్రజలు వారికే ఓటు వేస్తున్నారని మెలోనీ చెప్పారు. మేము స్వేచ్ఛని కాపాడుకుంటామని, మా దేశాన్ని ప్రేమిస్తామని, సురక్షితమైన సరిహద్దుల్ని కోరుకుంటున్నామని మెలోనీ అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Peddi : పెద్దిలో స్పెషల్ సాంగ్.. నలుగురు అందగత్తెల కోసం బుచ్చి సెర్చింగ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో...

RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

భారతీయ రైల్వే శాఖ నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. రైల్వే రిక్రూట్‌మెంట్...

Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలు మరోసారి...

Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

ఓ చిన్న క్లిక్.. ఓ వ్యక్తికి ల‌క్షల రూపాయ‌ల నష్టం తీసుకువ‌చ్చింది....