11
February, 2026

A News 365Times Venture

11
Wednesday
February, 2026

A News 365Times Venture

Gaurav Gogoi: “అవును, నేను నా భార్య 10 రోజులు పాకిస్థాన్‌లో గడిపాం.. కానీ”.. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడి సంచలన ప్రకటన!

Date:

Gaurav Gogoi: అస్సాంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి కారణం అస్సాం సీఎం హిమంత బిశ్వ ఇటీవల చేసిన సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ అధ్యక్షుడికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయనే కోణంలో సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ తీవ్రంగా ఖండించారు. తనను పాకిస్థాన్‌తో లింక్ చేయడం పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. నిన్న (మంగళవారం) గువాహటిలో మీడియాతో మాట్లాడిన గోగోయ్.. తన భార్య ఎలిజబెత్ కొల్బర్న్ 2013లో పాకిస్థాన్ వెళ్లిందని ఒప్పుకున్నారు. కానీ.. ఓ పని నిమిత్తం మాత్రమే పాకిస్థాన్ వెళ్లిందని స్పష్టం చేశారు. పది రోజుల పాటు పాకిస్థాన్‌లో ఉన్నామని.. తన భార్యతో పాటు తాను కూడా అక్కడే ఉన్నట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఎప్పుడూ ఎవరూ తనను ప్రశ్నించలేదని.. ఇది ఎలాంటి రహస్య ప్రయాణం కాదన్నారు. ఇప్పుడు ఈ విషయంపై రాద్ధాంతం చేయడం సరికాదని పేర్కొన్నారు.

READ MORE: Drishyam 3 : దృశ్యం 3’పై ప్రకాష్ రాజ్ క్లారిటీ

ముఖ్యమంత్రి హిమంత్ తన పిల్లల గురించి కూడా ప్రస్తావించారని, అది చాలా దిగజారిన చర్య అని గోగోయ్ విమర్శించారు. మాకు సీఎం కుటుంబం గురించి తెలుసు. కానీ మేము అలాంటి విషయాలు బయట పెట్టమన్నారు. తన పిల్లలపై చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు స్వయంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికను విడుదల చేయాలని గోగోయ్ డిమాండ్ చేశారు. “ఆరు నెలలుగా ఆ నివేదిక ముఖ్యమంత్రి వద్దే ఉంది. నిజంగా ఏమైనా ఆధారాలు ఉంటే అప్పుడే బయట పెట్టేవారు. మొదటి నుంచే నేను దర్యాప్తుకు సహకరిస్తానని చెప్పాను. ఇది జాతీయ భద్రత సమస్య అయితే ఆరు నెలలు ఎందుకు మౌనం వహించారు? మా పార్టీ సీఎం కుటుంబం వద్ద 12 వేల బిఘాల భూమి ఉందని బయటపెట్టిన తర్వాతే ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది” అని ప్రశ్నించారు.

READ MORE: The Rajasaab : ఓటీటీలో బయటపడుతున్న రాజాసాబ్‌ లోపాలు..హీరోయిన్‌ కి కూడా డూప్ వాడారా?

ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇటీవల గోగోయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గోగోయ్ భార్య ఎలిజబెత్ కొల్బర్న్‌కు పాకిస్థాన్‌కు చెందిన అలీ తౌఖీర్ షేక్‌తో లోతైన సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం పాకిస్థాన్‌కు చేరిందని సంచలన ఆరోపణలు చేశారు. 2013లో గోగోయ్ పాకిస్థాన్ పర్యటన రహస్యంగా జరిగిందని.. అక్కడ ఏదో శిక్షణ తీసుకున్నారనే అనుమానం ఉందని చెప్పారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతే దేశద్రోహం కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక ఎలిజబెత్ కొల్బర్న్ పాకిస్థాన్‌లోని LEAD అనే సంస్థలో పనిచేసిందని, ఆ సంస్థను అలీ తౌఖీర్ షేక్ నడిపిస్తారని సీఎం తెలిపారు. భారత్‌కు వచ్చాక కూడా ఆమెకు అక్కడి నుంచే జీతం వచ్చిందని, విదేశీ నిధుల నియమాలను దాటవేశారని ఆరోపించారు. ఆమె భారత్‌లో పనిచేస్తూ సేకరించిన సమాచారాన్ని షేక్‌కు అందించిందని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్య పాకిస్థాన్ బ్యాంక్ ఖాతాను గోగోయ్ ప్రకటించలేదని విమర్శలు చేశారు. ఈ పరస్పరం ఆరోపణలతో అస్సాం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Hardeep Singh Puri: ‘‘ఎప్‌స్టీన్‌ను 3-4 సార్లు కలిశా, కానీ’’ రాహుల్ విమర్శలపై కేంద్రమంత్రి క్లారిటీ..

Hardeep Singh Puri: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి...

Rafale fighter jets: ఆపరేషన్‌ సిందూర్‌లో అసలైన హీరో ‘‘రాఫెల్ జెట్స్’’..

Rafale fighter jets: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళానికి...

Deepali Ghosh: హ్యాట్సాఫ్ బామ్మ.. నెటిజన్ల మనసు గెలుచుకున్న 70 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్

Deepali Ghosh: ఒక బామ్మ కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా...

UP: భార్య చనిపోయిన 2 ఏళ్లకు ‘ఓటీపీ’.. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య...