19
April, 2025

A News 365Times Venture

19
Saturday
April, 2025

A News 365Times Venture

Gaddar Cine Awards: ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డ్స్ కు ఇంత స్పందన రాలేదు!

Date:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం జ్యూరీ సమావేశం ప్రముఖ సినీ నటి జయసుధ చైర్మన్‌గా జరిగింది. ఈ అవార్డుల కోసం వ్యక్తిగత క్యాటగిరీలో 1172 నామినేషన్లు, చలన చిత్రాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాలు తదితర క్యాటగిరీలలో 76 నామినేషన్లు స్వీకరించబడ్డాయి. మొత్తం 1248 నామినేషన్లతో ఈ అవార్డులకు భారీ స్పందన లభించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డిసి) ఛైర్మన్ మరియు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, జ్యూరీ సభ్యులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నామినేషన్లను పరిశీలించాలని కోరారు. “తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా జ్యూరీ సభ్యులు వ్యవహరించాలి. ఈ అవార్డుల కోసం ప్రభుత్వం నిష్ణాతులైన వారిని జ్యూరీ సభ్యులుగా నియమించింది,” అని ఆయన అన్నారు.

Raj Tarun : రాజ్ తరుణ్‌ పేరెంట్స్ ను ఇంట్లో నుంచి గెంటేసిన లావణ్య

దిల్ రాజు మాట్లాడుతూ, 14 ఏండ్ల విరామం తర్వాత తెలంగాణ ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను నిర్వహిస్తుండటం విశేషమని తెలిపారు. “ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డులకు ఇంతటి స్పందన రాలేదు. ఈసారి భారీ స్థాయిలో నామినేషన్లు రావడం సినీ రంగానికి గర్వకారణం,” అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ తెలుగు సినిమా రంగంలోని ప్రతిభను గుర్తించి, సత్కరించే లక్ష్యంతో నిర్వహించబడుతున్నాయి. ఈ అవార్డులు చలన చిత్ర నిర్మాణంలో వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభను వెలికితీసేందుకు ఒక వేదికగా నిలుస్తాయని ఆశిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శుభాంశు శుక్లా.. ముహూర్తం ఖరారు?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో అడుగుపెట్టిన మొట్ట మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా...

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

కాకాణిని పట్టిస్తే బహుమతి..! సోమిరెడ్డి ఆఫర్‌.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.....

UP: నలుగురు పిల్లల తల్లి ప్రియుడి కోసం.. భర్తకు టీలో ఎలుకల మందు కలిపి..

పరాయి వ్యక్తులపై మోజు కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నాయి. ప్రియుడి మోజులో భర్తల...

Off The Record : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో BRSలో వర్గపోరు..

మూల విరాట్‌కే దిక్కులేక ఓ మూలన ఉంటే…. ఉత్సవ విగ్రహం వచ్చి...