27
February, 2026

A News 365Times Venture

27
Friday
February, 2026

A News 365Times Venture

Fake Tea Powder: మనం తాగేది చాయ్ కాదు.. భాగ్యనగరంలో కల్తీ టీ పొడి ముఠా గుట్టురట్టు!

Date:

Fake Tea Powder: చాయ్.. ఓ రిలాక్సేషన్… వర్క్ మోడ్‌లో నుంచి కాస్త రీఎనర్జైజ్ కావాలంటే టీ పడాల్సిందే..!! ముఖ్యంగా ఆఫీసులలో పని చేసే వారు.. రోడ్డు పక్కన ఉన్న టీ హోటల్స్‌లో చాయ్ తాగుతుంటారు. కానీ ఆ టీ సేఫేనా? అందులో వేసే టీ పౌడర్‌ నాణ్యమైనదేనా? ఇలా ఎవరూ డౌట్ పడి ఉండరు. కానీ ఆ టీ పౌడర్‌ను కూడా కొంత మంది కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. అలాంటి ఓ కేటుగాడ్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ నకిలీ టీ పొడి దందాని పోలీసులు బయట పెట్టారు. టీ పొడి కల్తీ ముఠాను అరెస్ట్ చేశారు.

READ ALSO: TamilNadu: ప్రేమోన్మాదానికి ఒకే ఇంట్లో ఇద్దరి హత్య.. ఒకరి పరిస్థితి విషమం

వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, సనత్ నగర్ పోలీసులతో కలిసి సనత్ నగర్ పరిధిలోని ఒక ప్రాంగణంపై దాడి చేసింది. సింథటిక్ రసాయనాలను ఉపయోగించి టీ పొడిని కల్తీ చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని జగన్నాథ్ బిష్ణోయ్‌గా గుర్తించారు. అధిక లాభాల కోసం టీ పొడి కల్తీ చేస్తున్నట్లు అతడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. కోకోపీట్ అంటే కొబ్బరి పీచు పొడిని కొనుగోలు చేసి.. అందులోని వ్యర్థాలను తొలగిస్తాడు. దానికి వేడి బెల్లం నీటితో కలిపి రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టేవాడు. ఆ తర్వాత దానికి ‘సన్‌సెట్ ఎల్లో’ , ‘టార్ట్రాజైన్ ఆరెంజ్’ వంటి సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను కలిపేవాడు. ఈ రంగులను పీల్చుకున్న మిశ్రమాన్ని తిరిగి ఎండబెట్టి కల్తీ ప్రక్రియలో ఉపయోగిస్తున్నట్లు తేలింది.

ఒక కిలో కల్తీ టీ పొడిని తయారు చేయడానికి, నిందితుడు 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్‌ను మిక్స్ చేసేవాడు. ఈ కల్తీ టీ పొడిని అసలైన టీ పొడిగా నమ్మించి స్థానిక టీ స్టాళ్లకు, ఇతర డీలర్లకు భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద 120 కిలోలు రంగు కలిపిన టీ పొడి, సహజమైన టీ పొడి 30 కిలోలు, కోపీట్ మిశ్రమం 138 కిలోలు, సన్‌సెట్ ఎల్లో కలర్ 800 గ్రాములు, టార్ట్రాజైన్ కలర్ 700 గ్రాములు, బెల్లం బాక్సులు 12 స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రజలు టీ పొడిని కేవలం గుర్తింపు పొందిన విక్రేతల వద్దే కొనుగోలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆహార కల్తీకి సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

READ ALSO: ViRosh Wedding: రష్మిక – విజయ్ పెళ్లి ఫోటోలు వైరల్..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Taapsee Pannu: ట్రోల్స్ దెబ్బకి తాప్సి యూటర్న్?

ఇటీవల టాలీవుడ్ అంటేనే నడుము అందాల ప్రదర్శన అని, దర్శకులు కేవలం...

Lunar Eclipse: శివయ్య భక్తులకు అలర్ట్.. ఆ రోజున వేములవాడ రాజన్న, భీమన్న ఆలయాల మూసివేత

కేతు గస్త్ర పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3 న ఉదయం...

Komali Death Mystery: ఒక ఆత్మహత్య ఎన్నో ప్రశ్నలు.. చావుకు కారణం అదేనా?

Komali Death Mystery: యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు కారణాలేంటి? ఇదే ఇప్పుడు...

Student Sui*cide: ఓవైపు పేరెంట్స్.. మరోవైపు ప్రేమ.. ఎటు తేల్చుకోలేక!

Student Sui*cide: విశాఖ జిల్లా పెదగంట్యాడలో ఓ విద్యార్ధిని ఆత్మహత్య...