‘Hands Off’ Protest: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతడి మద్దతుదారు బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి వ్యతిరేకంగా యూఎస్ వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం అవుతోంది. ‘‘హ్యాండ్స్ ఆఫ్’’ నిరసన ప్రదర్శనలతో ఆందోళనకారులు హోరెత్తిస్తున్నారు. ట్రంప్ పరిపాలన విధానాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా ‘‘పరస్పర పన్నుల’’ విధించడం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఉద్యోగాల కోతపై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MASSIVE Anti-Trump uprising in NYC!! #HandsOff pic.twitter.com/Gb91kaPTKr
— Our Revolution (@OurRevolution) April 5, 2025
ఈ ఉద్యమానికి మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మద్దతు తెలిపారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని ఆమె ప్రశంసించారు. ‘‘నేను మన దేశంలోని ప్రతీ రాష్ట్రంలో, అమెరికన్లు ప్రాజెక్ట్ 2025ని పూర్తి వేగంతో అమలు చేస్తున్న పరిపాలనకు వ్యతిరేకంగా నిలబడ్డారు’’ అని ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ట్రంప్ తీరుపై కోపంతో ఉన్న అమెరికన్లు శనివారం యూఎస్ లోని పలు నగరాల్లో ర్యాలీలు చేశారు.
A new video shows just how massive today’s protest on Boston Common really is.
Bussed-in activists are demanding an end to deportations and ICE raids as well as cutting federal spending—sending a message to President Trump and Elon Musk.
Watch belowpic.twitter.com/9C1ATR7vfx
— Bostonians Against Mayor Wu (@AntiWuCoalition) April 5, 2025
Read Also: Bangladesh: చికెన్స్ నెక్ దగ్గరకు పాకిస్తాన్, కోల్‌కతా సమీపానికి చైనా.. భారత్‌తో యూనస్ గేమ్స్..
‘‘హ్యాండ్స్ ఆఫ్’’ నిరసలు అని పిలువబడే ఈ నిరసనలు మొత్తం యూఎస్‌లోని 50 రాష్ట్రాల్లోని 1200 కన్నా ఎక్కువ ప్రదేశాల్లో జరిగాయి. వీటిలో పౌరహక్కుల సంస్థలు, కార్మిక సంస్థలు, LGBTQ+ కార్యకర్తలతో సహా 150 పైగా సంఘాలు పాల్గొన్నాయి. న్యూయార్క్‌లోని మిడ్ టౌన్ మాన్ హట్టన్ నుంచి యాంకరేజ్, అలాస్కా, వాషింగ్టన్ వరకు ఉన్న నగరాల్లో నిరసనకారులు ట్రంప్, మస్క్‌కి వ్యతిరేకంగా నినదించారు. ఆర్థిక వ్యవస్థ, వలసలు, మానవహక్కులపై చర్యల్ని విమర్శించారు. సియాటల్, పోర్ట్ ల్యాండ్, ఒరెగాన్, లాస్ ఏంజిల్స్ వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు నినాదాలు చేశారు.
ఈ నిరసనల గురించి వైట్ హౌజ్ స్పందించింది. అధ్యక్షుడు ట్రంప్ వైఖరి స్పష్టంగా ఉందని, అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆయన ఎల్లప్పుడూ సామాజిక భద్రత, మెడికల్, మెడికేడ్‌ని రక్షిస్తారని, డెమొక్రాట్ల వైఖరి అక్రమ వలసదారులకు సామాజిక భద్రత, మెడికేర్ అందించిందని, ఇది ఈ కార్యక్రమాలను దివాళా తీసేలా చేసిందని, అమెరికన్లను అణిచివేసిందని ఒక ప్రకటనలో పేర్కొంది.
Today in every state across our nation, Americans are standing up to the administration as they implement Project 2025 at full speed.
Thank you for using your voices and the power of protest to stand for Social Security, Medicare, and Medicaid; for the Department of Education…
— Kamala Harris (@KamalaHarris) April 5, 2025