30
March, 2026

A News 365Times Venture

30
Monday
March, 2026

A News 365Times Venture

Dil Raju: తెలంగాణ నేపథ్యంలో ఆశిష్ రెడ్డి కొత్త సినిమా ‘దేత్తడి’

Date:

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు , యువ నటుడు ఆశిష్ రెడ్డి తన తాజా చిత్రం ‘దేత్తడి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఆదిత్య రావు గంగసాని రూపొందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ థీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమా మాస్ అప్పీల్‌తో కల్చరల్ డ్రామాగా తెరకెక్కనుంది. ఆశిష్ పుట్టిన రోజు సంధర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను ఇటీవల విడుదల చేసి, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు.
‘దేత్తడి’ సినిమా ఆశిష్ రెడ్డి కెరీర్‌లో నాల్గవ చిత్రం. గతంలో ‘రౌడీ బాయ్స్’, ‘సెల్ఫిష్’(ఇంకా రిలీజ్ కాలేదు ) , ‘లవ్ మీ: ఇఫ్ యు డేర్’ చిత్రాలతో తన నటనా ప్రతిభను చాటిన ఆశిష్, ఈ సినిమాతో మరోసారి వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. తెలంగాణ సంస్కృతి, జీవన శైలిని ప్రతిబింబించే ఈ చిత్రం, యువతను ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది. సికింద్రాబాద్‌లో ఈ సినిమా ప్రకటన గ్లిమ్స్ షూట్ చేసినట్లు సమాచారం. ఈ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆశిష్ రగ్గడ్ లుక్, తెలంగాణ సంప్రదాయాలను సూచించే బ్యాక్‌గ్రౌండ్ అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమా కథ, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ కొత్త చిత్రం, ఆశిష్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. గతంలో ఆయన చిత్రాలు యూత్‌ఫుల్, రొమాంటిక్ జోనర్‌లలో ఉండగా, ‘దేత్తడి’ మాత్రం తెలంగాణ కల్చరల్ డ్రామాగా, మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Kavitha: సీఎం రేవంత్‌రెడ్డికి కవిత లేఖ.. నాడు కేసీఆర్‌కు రాసిన లేఖను గుర్తు చేసిన జాగృతి అధినేత్రి!

Kavitha: సీఎం రేవంత్ రెడ్డికి జాగృతి అధినేత్రి కవిత లేఖ రాశారు....

Narayanpet: ఉపాధ్యాయుడి కీచక బుద్ధి.. విద్యార్థిని శీలానికి రూ. 20 లక్షలు వెలకట్టిన సర్పంచ్ భర్త!

Narayanpet: నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం ఎంపీహెచ్ఎస్ మోమినాపూర్ ఉన్నత పాఠశాలలో...

MI vs KKR Toss: టాస్ ఫిక్స్ జరిగిందా..? సోషల్ మీడియాలో రచ్చరచ్చ..

MI vs KKR Toss: ఐపీఎల్ 2026లో జరిగిన రెండో మ్యాచ్‌...

Rahul Banerjee: విషాదం.. యువ నటుడు రాహుల్ బెనర్జీ కన్నుమూత

బెంగాలీ యువ నటుడు రాహుల్ బెనర్జీ (43) అకాల మరణం చెందారు....